బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ఓ అమ్మాయి దొరికేసిందట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ట్విట్టర్‌లో తెలిపాడు. 'ముఝే లడ్కీ మిల్ గయీ' అంటూ సల్మాన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు.. 'సల్లూభాయ్‌కి అభినందనలు', 'సల్మాన్‌ మనసుకు నచ్చిన ఆ అమ్మాయి ఎవరో?', 'సల్మాన్ పెళ్లికి సిద్ధమయ్యాడు' అంటూ పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సల్మాన్.. రొమానియన్ అందగత్తె లులియా వాంటూర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ ఎప్పుడూ ఈ గాసిప్స్‌పై బహిరంగంగా స్పందించలేదు. అయితే ఇలాంటి సమయంలో తనకు అమ్మాయి దొరికిందంటూ సల్మాన్ పోస్టు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


కొద్దిసేపటికే సల్మాన్ మరో ట్వీట్ చేశాడు. "అంతలా ఆలోచించకండి. ఆయుష్ శర్మ హీరోగా నేను నిర్మించే 'లవ్ రాత్రి' సినిమాకు హీరోయిన్‌గా 'వారినా' దొరికింది'" అని చెప్ప అందరినీ కంగు తినిపించాడు. అభిరాజ్ మినవాలా ఈ సినిమాకు దర్శకుడు. కాగా, ఆయుష్ శర్మ, మోడల్ వారినా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు. ఇద్దరికీ ఇది తొలి సినిమా.