Samantha Breaks Silence at Koffee with Karan show: హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సమంత ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహమాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఎంతో ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా విడాకుల పుకార్లు ప్రారంభమైన కొద్ది రోజులకే తాము విడిపోతున్నామని వారిద్దరు అధికారికంగా ప్రకటించారు. అయితే వారు ఎందుకు విడిపోయారు అనే విషయం మీద ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇందులో సమంత తప్పే ఎక్కువగా ఉందంటూ సోషల్ మీడియాలో, మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఈ విషయం మీద సమంత సీరియస్ అవుతూ కోర్టు మెట్లు కూడా ఎక్కగా కోర్టు మాత్రం వ్యకిగత జీవితాన్ని బయట పెడుతున్నందుకు సమంతకు, ఆమె వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేస్తున్నందుకు మీడియా మీద కూడా అక్షింతలు వేసి ఇక మీదట ఇలాంటి విషయాలు జోలికి వెళ్ళవద్దని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తన విడాకుల తర్వాత సమంత ఎప్పటికప్పుడు తాను బాధపడుతున్నాననే విషయాన్ని చెప్పడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేది. తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఇదే విషయాన్ని ఆమె తన అభిమానులకు అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో మాత్రం ఆమె తన దాంపత్య జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. 


ఇప్పటికే ఆరు విజయవంతమైన సీజన్లు పూర్తయిన నేపథ్యంలో ఏడవ సీజన్ కూడా ప్రారంభం కానుంది. జూలై ఏడో తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేయగా అందులో విజయ్ దేవరకొండ మొదలు సమంత, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారు కనిపించారు. ఇక సమంత, అక్షయ్ కుమార్ కలిసి కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్లో పాల్గొనగా ఈ ఎపిసోడ్లో సమంత దాంపత్య జీవితం గురించి కరణ్ జోహార్ ప్రశ్నించారు. 


దానికి సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ సంతోషకరంగా లేని వివాహ బంధాలన్నింటికీ నువ్వే కారణం అంటూ కరణ్ జోహార్ ను నిందించారు. అయితే అది సరదాగానే అనుకోండి. అసలు విషయం ఏమిటంటే సమంత మాట్లాడుతూ 2001వ సంవత్సరంలో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కభీ ఖుషి కభీ ఘం అనే సినిమా చూసి పెళ్లి తర్వాత జీవితం అంటే అలాగే ఉంటుందని అనుకున్నానని కానీ పెళ్లి తర్వాత జీవితం అనేది కేజీఎఫ్ లాగా మారిందని ఆమె కామెంట్స్ చేసింది. వివాహ బంధం తర్వాత కేజిఎఫ్ లో హీరోయిన్ పడినన్ని కష్టాలు పడాల్సి వచ్చిందని సమంత కామెంట్ చేసిందని భావిస్తున్నారు. ఇక విడాకుల తరువాత అటు సమంత ఇటు నాగచైతన్య కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. 


Also Read: Kiara Advani Pics: పొట్టి డ్రెస్సులో కియారా అద్వానీ.. గ్లామర్ షో మాములుగా లేదు!


Also Read: Disha Patani Images: బ్లాక్ డ్రెసులో దిశా పటాని.. బ్లాస్టింగ్ అందాలు తట్టుకోవడం కష్టమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.