సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'యూ టర్న్‌'. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలలో కనిపించనున్నాడు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించాడు. ఈ నెల 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూ టర్న్‌ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మించారు. రాహుల్‌ రవీంద్రన్‌, భూమికా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ఫ్లై ఓవర్ వద్ద వరసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్ట్‌లా సమంత ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమె తనకు తెలియకుండానే అనేక సమస్యల్లో ఇరుక్కుంటుంది. ఆ సమస్యల నుండి ఆమె ఎలా బయటపడిందో తెలియజేసేలా దర్శకుడు పవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.


శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 3గంటలకు సమంత ఫేస్‌బుక్ ఆఫీసుకి వెళ్లనుంది. ఫేస్‌బుక్‌లో అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆమె లైవ్ షో ద్వారా నేరుగా సమాధానాలు ఇవ్వనుంది.