Jabardasth Satya Chammak Chandra జబర్దస్త్ షోలోకొ వచ్చే వారు వస్తూనే ఉంటారు.. పోయే వారు పోతూనే ఉంటారు. జబర్దస్త్, మల్లెమాల చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగబాబు బయటకు రావడం, నితిన్ భరత్ డైరెక్టర్లు కొత్త షోలు పెట్టుకోవడంతో జబర్దస్త్ షోలో చీలికలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబుతో చాలా మంది బయటకు వచ్చారు. అందులో చమ్మక్ చంద్ర ముఖ్యుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికే చమ్మక్ చంద్ర స్కిట్లు టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుండేవి. చంద్ర టీంలో అంతకు ముందు లేడీ గెటప్పులుండేవారు. లేదంటే చంద్రనే ఆడ వేషం వేసేవాడు. కానీ ఒక్కసారి సత్య ఎంట్రీ ఇచ్చాక టీం మరింతగా మారిపోయింది. సత్య కామెడీ టైమింగ్, ఇద్దరి కో ఆర్డినేషన్ బాగానే క్లిక్ అయింది. అలా చమ్మక్ చంద్ర, సత్యలు బాగానే స్కిట్లు నడిపించారు. చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడంతో అతనితో పాటు సత్య కూడా వెళ్లిపోయింది.


 



కామెడీ స్టార్స్ అంటూ స్టార్ మాలో కొన్ని రోజులు సందడి చేసింది. అంతకు ముందు జీ తెలుగులో అదిరింది అనే షోను చేశారు. ఇప్పుడు సత్య అయితే మళ్లీ జబర్దస్త్ షోకు తిరిగి వచ్చింది. కానీ చమ్మక్ చంద్ర మాత్రం తిరిగి రాలేదు. ఆయన ఇంకా స్టార్ మాలోనే ఉన్నాడు. ఈమె మాత్రం ఈటీవీలోకి వచ్చింది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమోను వదిలారు. అందులో సత్య కనిపించింది. అయితే చమ్మక్ చంద్ర కూడా వస్తాడా? లేదంటే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె ఇలా బయటకు వచ్చిందా? అన్నది తెలియడం లేదు.


తన గురువు చమ్మక్ చంద్ర అని, ఆయన బయటకు రావడంతోనే తాను కూడా వచ్చానంటూ.. సత్య ఆ మధ్య చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడేమో ఇలా తన గురువుని వదిలేసి జబర్దస్త్ షోకు వచ్చింది. తాగుబోతు రమేష్ టీంలో సత్య కనిపించింది. అసలే రమేష్ టీం గాల్లో దీపంలా ఉంది. ఆయన స్కిట్లు ఒక్కటి కూడా పేలడం లేదు. ఆ టీంలోకి సత్య రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.


Also Read : Jabardasth Varsha in Saree : వామ్మో వర్ష ఇలా వంగిపోయిందంటే?.. కిటికీల జాకెట్‌తో అందాల ప్రదర్శన


Also Read : Gruhalakshmi Serial Samrat : మిడ్ నైట్ సినిమా చూపించేశాడుగా.. బెడ్రూంలో ఇంద్రనీల్ గోల.. తలపట్టేసుకున్న భార్య


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook