SBI WhatsApp Banking: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను లాంచ్ చేసింది. దీని ద్వారా కస్టమర్స్ వాట్సాప్ చాట్ బాక్స్‌లో బ్యాంకింగ్ వివరాలను పొందవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్‌తో పాటు ఇతరత్రా వివరాలు క్షణాల్లో వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో కస్టమర్స్‌కు అందుతాయి. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎస్‌బీఐ అందించే ఈ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టమర్స్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి :


ఎస్‌బీఐ అందించే వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీ ఎస్‌బీఐ అకౌంట్‌తో లింకప్ అయి ఉన్న మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం మొదట 7208933148 నంబర్‌కు మీ మొబైల్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ పంపించాలి. టెక్స్ట్ మెసేజ్‌లో WAREG అని టైప్ చేసి.. స్పేస్ ఇచ్చాక మీ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్‌ను పంపించాక మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్లు ఎస్ఎంఎస్ అందుతుంది.


ఈ నంబర్‌ను మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి :


వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయ్యాక 90226 90226 నుంచి మెసేజ్ అందుతుంది. ఈ నంబర్‌ను కస్టమర్స్ తమ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. అలా అయితేనే వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందుతారు.


ఏయే సేవలు పొందుతారు :


ఎస్‌బీఐ 90226 90226 నంబర్‌ని సేవ్ చేసుకున్నాక.. వాట్సాప్‌లో ఆ నంబర్‌కి Hi అని మెసేజ్ పెట్టండి. అంతే వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు యాక్టివేట్ అవుతాయి.


అకౌంట్ బ్యాలెన్స్ - ఇందుకోసం ఎస్‌బీఐ వాట్సాప్ చాట్ బాక్స్‌లో 1 ఎంటర్ చేయాలి.
మినీ స్టేట్‌మెంట్ - ఇందుకోసం ఎస్‌బీఐ వాట్సాప్ చాట్ బాక్స్‌లో 2 ఎంటర్ చేయాలి.
వాట్సాప్ బ్యాంకింగ్ డీరిజిస్టర్ - ఇందుకోసం ఎస్‌బీఐ వాట్సాప్ చాట్ బాక్స్‌లో 3 ఎంటర్ చేయాలి.
కస్టమర్స్ తమ సందేహాలు లేదా ఏవైనా వివరాలు కావాలనుకుంటే చాట్ బాక్స్‌లో వాటిని పోస్ట్ చేసి సమాధానాలు పొందవచ్చు.


Also Read: Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!


Also Read: Destination Alert: డెస్టినేషన్ అలర్ట్.. ఇక రైల్వే ప్రయాణికులకు ఆ టెన్షన్ అక్కర్లేదు...  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook