World Most Expensive Shares: ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ ఏదో తెలుసా..? ఒక్కో షేర్ ధర రూ. 3.83 కోట్లు
Share Market News: ఇండియాలో అత్యంత ఖరీదైన షేర్ ఎంఆర్ఎఫ్ అని తెలుసు. ఎంఆర్ఎఫ్ షేర్ ఒక్కొక్కటి 84 వేల రూపాయలుంది. మరి ప్రపంచంలో అత్యధిక ఖరీదైన షేర్ ఎంత, ఏం కంపెనీదో మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
World Most Expensive Share is Berkshire Hathaway: షేర్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు అందుబాటులో ఉంటాయి. వేర్వేరు కంపెనీ షేర్ల ధరలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని షేర్లు చాలా చౌకగా ఉంటే కొన్ని అత్యంత ఖరీదైనవి ఉంటాయి. ఇండియాలో ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ అత్యంత ఖరీదైందిగా భావిస్తారు. ఈ కంపెనీ షేర్ ఏకంగా 84 వేల రూపాయలు. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ ఏ కంపెనీది, ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. నమ్మశక్యం కాని ధర అది. ఈ షేర్ కొనడం అందరివల్ల కానిపని.
మనం చర్చిస్తున్న షేర్ కంపెనీ Berkshire Hathawayఈ కంపెనీ షేర్ వేలల్లో, లక్షల్లో లేదు. కోట్లలో ఉంటుంది. నమ్మశక్యంగా లేదా. నిజమే. ఈ కంపెనీ ఒక్క షేర్ కొనాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే.
Berkshire Hathaway షేర్ ధర
ప్రస్తుతం Berkshire Hathaway షేర్ ధర 4,67,660 అమెరికన్ డాలర్లు. అంటే ఇండియన్ రూపీస్‌లో చెప్పుకుంటే 3 కోట్ల 83 లక్షల 38 వేల 439 రూపాయల 44 పైసలు. ఈ కంపెనీ ఒక్క షేర్ కొనాలంటే కోటీశ్వరుడై ఉండాలి. ఇదొక అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం నెబ్రాస్కాలో ఉంది.
Also Read: Bank Holidays from Today: ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు
కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ ఆదాయంతో పోలిస్తే అతిపెద్ద ఆర్ధిక సేవల కంపెనీ ఇది. వారెన్ బఫెట్ ఈ కంపెనీ ఛైర్మన్. ఈ కంపెనీ షేర్ ఎందుకింత ఖరీదంటే..ఇప్పటి వరకూ ఎప్పుడూ స్టాక్ స్ప్లిట్ కాలేదు. అక్టోబర్ 23, 2026 న తొలిసారి కంపెనీ స్టాక్ లక్ష డాలర్లు దాటేసింది.
Also Read: Remote Ceiling Fan: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook