Shoulder pain issues to Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చివరిగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ఎన్టీఆర్. కరోనా కారణంగా సుదీర్ఘంగా సాగిన ఈ సినిమా షూటింగ్ లో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఇక తర్వాత ఎట్టకేలకు మార్చి నెలలో ఈ సినిమా విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు చేసిన ఫైట్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే జంతువుల ఫైట్ విషయంలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం గొడ్డులా కష్టపడిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు షోల్డర్ నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. రెస్ట్ మోడ్ లో ఉన్న ఆయన బింబిసార ఈవెంట్ కి కూడా ఈ సమస్యతో బాధపడుతూనే హాజరయ్యారని తెలుస్తోంది.


ఎన్టీఆర్ భుజం నొప్పి గురించి వైద్యులను సంప్రదిస్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పిన నేపద్యంలో రెస్ట్ తీసుకున్న తర్వాత షోల్డర్ సమస్య తగ్గితేనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కోలుకున్న తరువాత కొరటాల శివ సినిమాకి తగ్గట్లుగా ఎన్టీఆర్ మేకోవర్ కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో షూటింగ్ ఉండే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Nithya Menon: పెళ్లి చేసుకోమని వేధింపులు.. 30 ఫోన్లతో నరకం చూపించాడు.. నిత్య మీనన్ సంచలన ఆరోపణలు!


Also Read: Gopisundar: సింగర్‌ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook