Shruti Haasan Marriage శ్రుతి హాసన్ తాజాగా తన పెళ్లి మీద క్లారిటీ ఇచ్చేసింది. అసలు తనకు పెళ్లి వ్యవస్థ మీదే నమ్మకం లేదని తేల్చి చెప్పింది. శంతను, తనకు పెళ్లి వివాహా వ్యవస్థ మీద నమ్మకం లేదని, ప్రస్తుతం తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అయినా పెళ్లి కంటే కమిట్మెంట్, లాయల్టీ అనేవి ముఖ్యం అని, పెళ్లి చేసుకున్న ఎంతో మందిలో అవి లేవని నవ్వుకుంటూ అనేసింది. అసలు తాను పెళ్లి చేసుకుంటానా? లేదా? అన్నది కూడా తెలియదని, కానీ తాము ఇప్పుడు ఉన్న రిలేషన్‌లో ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక శ్రుతి హాసన్ శంతనుల ప్రేమ వ్యవహారం గురించి చెప్పాల్సిన పని లేదు. ముంబై వీధుల్లో షాపింగ్ మాల్స్‌లో ఈ ఇద్దరూ చేసే రచ్చ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రుతి హాసన్‌ శంతనుల పెళ్లి రూమర్లు ఇది వరకే ఎన్నో సార్లు నెట్టింట్లో రచ్చ రచ్చ చేశాయి. కోలీవుడ్‌ మీడియాలో పదే పదే వార్తలు రావడం, రూమర్లు వస్తుండటంతో శ్రుతి హాసన్ కౌంటర్లు వేసింది. తానేమీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.


అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి మీదే నమ్మకం లేదని ఖరాఖండీగా చెప్పేసింది. భవిష్యత్తులోనూ పెళ్లి చేసుకోనని, ఇలానే డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతామని పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. పెళ్లి కంటే ముఖ్యం కమిట్మెంట్‌గా ఉండటం, విధేయతతో మెలగడం ముఖ్యమని, ఇప్పుడు అవి రెండూ కూడా తమ మధ్య ఉన్నాయని క్లారిటీగా చెప్పేసింది శ్రుతి హాసన్.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో ఇబ్బంది పడ్డట్టు శ్రుతి హాసన్ తెలిపింది. అందుకే ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. గడ్డ కట్ట చలిలో తనకు కేవలం పల్చటి చీరను ఇచ్చారని, హీరోకు మాత్రం కోట్లు, శాలువాలు కప్పి ఉంచారని వాపోయింది శ్రుతి హాసన్. అలా ఎందుకు చేస్తారంటూ రీసెంట్‌గా ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు ఇక్కడ అవకాశాలు కూడా వచ్చేలా కనిపించడం లేదు.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook