సంక్రాతి కానుకగా విడుదలై ... సూపర్ హిట్  టాక్‌తో  దూసుకుపోతున్న చిత్రం 'అల వైకుంఠపురములో..'. ఈ సినిమా పాటలు విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తోపాటు సామాన్య ప్రేక్షక జనాలను  కూడా విపరీతంగా ఆకర్షించాయి. 'సామజవరగమణ', 'రాములో.. రాములా' , 'బుట్టబొమ్మ... బుట్టబొమ్మ' పాటలు ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుంచే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన స్టామినాను మరోసారి నిరూపించారు. ఐతే ఈ చిత్రం విడుదలైన తర్వాత చిత్రం యూనిట్ మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. అదే 'సిత్తరాల... సిరపడు.. సిత్తరాల.. సిరపడు' సాంగ్. ఈ పాట కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. ఆన్‌లైన్ లో విడుదలైన మూడు రోజుల్లోనే 5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. 
పాట గురించి.. 
అల వైకుంఠపురములో..' చిత్రంలోని 'సిత్తరాల సిరపడు..'  పాటను .. విజయ్ కుమార్ అనే ఎల్ఐసీ అధికారి రచించారు. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  ఈ పాటను తమకు అనుకూలంగా సినిమాలో వినియోగించారు. ఈ పాట పూర్తిగా జానపద గేయం రూపంలో సాగుతుంది. అచ్చమైన జానపదానికి ప్రతీకగా నిలిచిన ఈ పాటను సూరన్న, సాకేత్ అద్భుతంగా ఆలపించారు. తమన్ అందించిన మంచి మ్యూజిక్ తోడు కావడంతో పాట వినసొంపుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రామ్మోహన్ నాయుడు ప్రశంస
శ్రీకాకుళం యాసలో రాసిన 'సిత్తరాల సిరపడు..'  విని ఎంతో ఆనందించానని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. తమ ప్రాంత యాసలో రచించిన పాటను సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిక్కోలు యాసలో పాట పాడిన సూరన్న, సాకేత్‌ను రామ్మోహన్ నాయుడు అభినందించారు.



మరోవైపు 'సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు' పాటను చాలా మంది తమ సెల్ ఫోన్ రింగ్ టోన్‌గా సెట్ చేసుకుంటున్నారు. అంటే ఈ పాట ఎంతగా ప్రజాదరణ పొందిందో అర్ధమవుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..