క్యాన్సర్ రోగులకు సోనాలి సందేశం ఇదే...
ఇటీవలే క్యాన్సర్కు చికిత్స తీసుకుని ఇండియాకు వచ్చిన ప్రముఖ నటి సోనాలి బింద్రే.. క్యాన్సర్తో పోరాడుతున్న మహిళలకు ఆమె సందేశం ఇచ్చారు. ఇది గుండె ధైర్యంతో ఉండాల్సిన సమయమని...భయ పడితే బతకలేమని..హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలన్నారు. రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు హ్యాపీగా ఉండవచ్చన్నారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ తో పాటు మంచి స్నేహితులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఇది ప్రేమానురాగం పొందాల్సిన సమయమని సోనాలి తెలిపారు.
సోనాలి బింద్రే బతికే అవకాశం 30 శాతమేనని వైద్యులు తేల్చారు.. గుండె పగిలే వార్త విన్న సోనాలీ తొలుత భయపడ్డారట. ఆ తర్వాత తేరుకొని తనకు తాను ధైన్యం చెప్పుకొని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఇలా క్యాన్సర్ రోగులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు.