SP Balasubrahmanyam's latest health bulletin: చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం ( SPB health condition ) బాగా క్షీణించిందని చెన్నైలో బాలు చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గురువారం సాయంత్రమే ఓ హెల్త్ బులిటెన్ ద్వారా తెలియజేశారు. బాలుకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు ఆ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలు కుటుంబసభ్యులు ( SPB family ) అందరూ ఆసుపత్రికి చేరుకున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలు చిరకాలమిత్రుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని ( Kamal Haasan reaches MGM hospital ) బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలు కుటుంబం, కమల్ హాసన్ రాకతో ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. Also read : SP Balu health bulletin: మరింత క్షీణించిన బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల


బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ( SP Balasubrahmanyam's health condition ) ఆస్పత్రి వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారనే వార్త బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాలు ఆరోగ్య పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉంటే కానీ ఆరు గంటల వ్యవధిలోనే ఇలా అర్థరాత్రి వేళ హెల్త్ బులెటిన్ విడుదల చేసేందుకు సిద్ధపడరు అని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. Also read : SPB health condition: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరోసారి తీవ్ర అస్వస్థత


గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఏమీ కాకూడదని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చి మళ్లీ పాటలు పాడాలని బాలసుబ్రహ్మణ్యం అభిమానులు ప్రార్థిస్తున్నారు. మనందరి ప్రార్థనలు ఫలించి ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe