జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విషయంలో శ్రీరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా అంటే ఔననే సమాధానం వస్తుంది ఆమె తాజా కామెంట్స్ గమనిస్తే. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్టు చేసింది. వ్యక్తి పేరు చెప్పకుండా ఒకాయనపై తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నానని ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి సోషల్ మీడియా వార్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఉపయోగించిన  ఒకాయన పదం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినదే అనే విషయం జగమెరిగిన సత్యం. శ్రీరెడ్డి  తాజా వ్యాఖ్యలు పవన్ ఉద్దేశించినవే కాబట్టి.. ఇక పవన్ పై శ్రీరెెడ్డి పోరాటానికి పుల్ స్టాప్ చెప్పినట్లుగానే భావించాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


శ్రీరెడ్డి పోస్టు యధాతథంగా చదవండి


"ఇక నుంచి మళ్ళీ మా నిరసనలు కొనసాగిస్తాం... నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ప్రత్యేకించి కోపం లేదు... అయితే..ఓ వ్యక్తి వ్యాఖ్యలతో, ప్రవర్తనతో బాధపడ్డాము. ఆయనపై చేస్తున్న పోరాటాన్ని ఇక నుంచి ఆపేస్తున్నాను. నా పోరాటం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రక్షాళన చేయడం పైనే ఉంటుంది. ఇకపై వ్యక్తిగత యుద్ధాలు ఉండకపోవచ్చు... నా వ్యక్తిగతం కన్నా ..  నిరసనలనే నేను ఎక్కువగా గౌరవిస్తున్నాను. కృతజ్ఞతలు" అని శ్రీరెడ్డి పేర్కొంది .



గతంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేసిన శ్రీరెడ్డి..మళ్లీ పవన్ పై ఎదురు దాడి చేసింది. ఈ నేపథ్యంలో మాటకు నిలబడి వ్యక్తిగత దూషణలకు శ్రీరెడ్డి దూరంగా ఉంటుందా..(లేదా) మళ్లీ యూటర్న్ తీసుకుంటుందా అనేది చర్చనీయ అంశంగా మారింది.