SBI Interest Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లు పెంచేసింది. ఫలితంగా ఈఎంఐలు పెరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఇది బ్యాడ్‌న్యూస్. బ్యాంకు అధికారికంగా ఎంసీఎల్ఆర్‌లో పెంపుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఎస్బీఐ రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఫలితంగా ఈఎంఐలపై ఇవాళ్టి నుంచే ఆ ప్రభావం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలికాలంలో రెపోరేటు పెంచడంతో ఈ పరిస్థితి ఎదురైంది.


ఎస్బీఐ రుణాలు ఇక నుంచి మరింత ప్రియం కానున్నాయి. ఎస్బీఐ నుంచి తీసుకున్న వివిధ రకాల రుణాలపై ఈఎంఐ ఇక నుంచి పెరగనుంది. ఎందుకంటే ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పెంచేసింది. కొత్త ధరలు ఆగస్టు 15 అంటే ఇవాళ్టి నుంచే అమల్లో రానున్నాయి. గతంలో జూన్, జూలై నెలల్లో కూడా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది. 


ఎస్బీఐ ఇవాళ అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి రుణాలపై ఎంసీఎల్ఆర్‌ను పెంచింది. ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయి ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరగనుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నెలలోనే రెపో రేటును 50 పాయింట్లకు పెంచింది. దాంతో బ్యాంకు విభిన్న లెండింగ్ రేట్లను పెంచింది. ఎస్బీఐ గత వారమే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లను పెంచింది. గత వారమే ఎంసీఎల్ఆర్‌లో 10 అంకెలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 


ఇవాళ్టి నుంచి మూడు నెలల వరకూ లోన్ల ఎంసీఎల్ఆర్ రేటు 7.15 నుంచి 7.35కు పెరిగింది. అంటే ఆరు నెలల రుణం ఎంసీఎల్ఆర్ రేటు కూడా 7.45 నుంచి 7.65 శాతానికి పెరిగింది. ఇక ఏడాదిదైతే 7.5 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. అటు రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 7.7 శాతం నుంచి 7.9 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది.


Also read: ITR Rules Changed: ఐటీ రిటర్న్స్‌లో కొత్త నిబంధనలు, వెరిఫికేషన్‌కు ఇప్పుడు నెలరోజులే గడువు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook