ITR Rules Changed: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కొత్త డెడ్‌లైన్ విధించింది.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కావాలంటే చివరిగా చేయాల్సింది ఈ వెరిఫికేషన్. గడువు తేదీలోగా ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తికాకపోతే ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణిస్తారు. ఇప్పటికే ఐటీఆర్ ఫైలింగ్ చివరితేదీ జూలై 31తో ముగిసింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే గడువు తేదీను మరోసారి పొడిగించలేదు. మీరు మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే..ఇప్పుడు జరిమానాతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా ఐటీఆర్‌కు సంబంధించి కీలకమైన్ నియమాల్ని ప్రభుత్వం మార్చేసింది. ఈ వెరిఫికేషన్ నియమాల్ని కఠినం చేసింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..ఈ వెరిఫికేషన్‌కు కేవలం నెల రోజులే సమయం లభిస్తుంది.
ఈ ఆదేశాల ప్రకారం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన తరువాత ఈ వెరిఫికేషన్ లేదా ఐటీఆర్ వి హార్డ్ కాపీ కోసం 120 రోజుల సమయం నుంంచి నెలరోజులకు తగ్గించేసింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలౌతున్నాయి. ఆదాయశాఖ చట్టాల ప్రకారం ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత వెరిఫికేషన్ కాకపోతే దానికి సక్రమంగా భావించరు. నియమాల ప్రకారం ఆరు విధానాల్లో ధృవీకరించాల్సి ఉంటుంది. ఐటీఆర్ 1 ఐటీఆర్ 2, ఐటీఆర్ 4లకు ఆడిటింగ్ అవసరం లేదు. ఐటీఆర్ ధృవీకరణ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం..
ఐటీఆర్ ఈ వెరిఫికేషన్ ఇలా
ఆధార్ ఓటీపీ ద్వారా చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పైలింగ్ లాగిన్ అవాలి. బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ద్వారా ఈవీసీ చేయవచ్చు. డీమ్యాట్ ఎక్కౌంట్ నెంబర్ ద్వారా కూడా ఈవీసీ చేయవచ్చు. బ్యాంక్ ఏటీఎం ద్వారా కూడా ఈవీసీ చేసుకోవచ్చు. సీపీసీ, బెంగళూరుకు పోస్ట్ ద్వారా వెరిఫికేషన్ చేయవచ్చు.
Also read: National Flag Code: జాతీయ జెండాను వాహనాలపై ఎగురవేయవచ్చా, అలా చేయడం ఎందుకు శిక్షార్హం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook