హైదరాబాద్: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. వరుసగా సందేశాత్మక సినిమాలు చేస్తూ వస్తోన్న మహేష్.. సరిలేరు నీకెవ్వరుతో మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి బరిలోకి దిగాడు. అనిల్‌ సుంకర, దిల్ రాజులతో కలిసి నిర్మాతగా బాధ్యతలను మహేష్ బాబు స్వీకరించారు. లాంగ్ గ్యాప్ తర్వాత ‘లేడీ సూపర్ స్టార్’ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తొలిరోజు మహేష్ బాబుకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనేలా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ ప్రోమో వీడియో విడుదల


సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో రూ.46.77 కోట్ల షేర్ సాధించింది. దీంతో ఓవరాల్‌గా తొలిరోజు రూ.80కోట్ల మేర గ్రాస్ సాధించి ఉండొచ్చునని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో రోజు (జనవరి 12న) బన్నీ నటించిన అల వైకుంఠపురంలో విడుదల కావడం, హిట్ టాక్ రావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్లకు బ్రేకులు పడ్డాయి. రెండో రోజు రూ.14కోట్ల మేర వసూలు చేసిన మహేష్ సినిమా మూడోరోజు బాక్సాఫీసు వద్ద మరింతగా నిరాశ పరిచింది.


మూడోరోజైన సోమవారం (జనవరి 13న) రూ.9కోట్లు కూడా వసూళ్లు రాబట్టలేదట. ఓ వైపు వర్కింగ్ డే కావడం, మరోవైపు అల వైకుంఠపురం హిట్ టాక్, బన్నీ-త్రివిక్రమ్ హ్యాట్రిక్ సక్సెస్ అని ప్రచారం జరగడమూ మహేష్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో భారీగా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు ఓ బ్లాక్‌బస్టర్ ప్రోమోతో పాటు పోస్టర్ విడుదల చేశారు. ప్రోమోతో పాటు బ్లాక్ బస్టర్ ప్రోమో పేరిట ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..