Mahesh Babu and Sitara: జీ తెలుగు కోసం కుమార్తెతో కలిసి మహేష్ స్పెషల్ వీడియో.. గుండె పిండేశారు భయ్యా!
Superstar Mahesh Babu and Sitara Featuring Zee Telugu Musical Concept Promo: మహేష్ బాబు ఒక ప్రోమో ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు.
Superstar Mahesh Babu and Sitara Featuring Zee Telugu Musical Concept Promo: తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా సర్కారు వారి పాట సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఈ మధ్యకాలంలో జీ తెలుగు ద్వారా అనేక పర్యాయాలు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయన ఒక ప్రోమో ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు.
తెలుగులో జీ తెలుగు సీరియల్స్ చాలా పాపులర్ అనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సరికొత్తగా జీ తెలుగులో మూడు సీరియల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు సీరియల్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు తన కుమార్ సితారతో కలిసి ఆ సీరియల్స్ లోని నటీనటులతో చేసిన ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది. దానిని తాజాగా జీతెలుగు రిలీజ్ చేసింది జీ తెలుగులో ప్రసారం కాబోతున్న పడమటి సంధ్యారాగం, అమ్మాయి గారు, శుభస్య శీఘ్రం అనే సీరియల్స్ కథనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిచయం చేస్తూ షూట్ చేసిన ఒక చిన్నపాటి వీడియోలో మహేష్ బాబుతో పాటు ఆయన కుమార్తె సితార కూడా కలిసి కనిపించింది.
ఇక వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ వీడియోకి మరింత అందాన్ని ఆప్యాయతను తీసుకువచ్చింది అనంతంలో ఏమాత్రం సందేహం లేదు. సీతారామం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ ప్రోమోకి ఎస్పీ చరణ్ తన గాత్రాన్ని అందించడం ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి ఈ మూడు సీరియల్స్ పై చేసిన ప్రోమో ఒక్కసారిగా సీరియల్స్ తో పాటు జీ తెలుగు సంస్థ మీద కూడా అంచనాలు పెంచేసింది. పడమటి సంధ్యారాగం అనే సీరియల్ జీ తెలుగులో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతోంది.
అమెరికాలోని పుట్టి పెరిగిన ఒక అమ్మాయి సంప్రదాయకరమైన తన పెద్దమ్మ కుటుంబంలో నివసించవలసి వస్తే జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశారు. అలాగే ఒక తండ్రి ఆప్యాయత కోసం పరితపించే ఒక అమ్మాయి జీవిత ఆధారంగా అమ్మాయిగారు అనే మరో సీరియల్ సిద్ధం చేశారు. అలాగే మధ్య తరగతి తల్లి తన కూతుర్ని తన కుటుంబాన్ని ఆపదల నుంచి ఎలా కాపాడుతుంది అనేదాన్ని ప్రధాన కథాంశంగా శుభశ్య శీఘ్రం అనే మరో సీరియల్ ని రూపొందించారు.
ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ప్రతి కథకు దానికంటూ ఒక సోల్ అలాగే దానికి సంబంధించిన సపరేట్ ప్రేక్షకులు ఉంటారని అందువల్ల ఒక వినూత్న ట్రీట్మెంట్ తో వాటిని ప్రపంచంలోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మూడు సీరియల్స్ కథలు ప్రేక్షకులు రిలేట్ అయ్యే విధంగానే ఉన్నాయని, ఈ సీరియల్స్ ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నేను జీతెలుగుతో జత కట్టడం ఎంతో ఆనందంగా ఉందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని నా కూతురుతో కలిసి చేయడం ఇంకా ఆనందంగా ఉందన్న ఆయన ఈ మూడు సీరియల్స్ టీమ్స్ జీ తెలుగు యాజమాన్యానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలిపారు.
Also Read: Sonal Chauhan Injured: షూటింగ్లో నాగ్ హీరోయిన్ కి గాయాలు.. అసలు ఏమైందంటే?
Also Read: JR NTR vs Ram Charan: ఆస్కార్ బరిలో రామ్ చరణ్ కంటే ఎన్టీఆరే బెటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి