సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ( Sushant Singh Rajput's death case )  విచారణలో భాగంగా ప్రస్తుతం అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సీబీఐ ( CBI ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ) వంటి దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియా చక్రవర్తి కాల్ డేటా పరిశీలించిన దర్యాప్తు బృందాలకు.. ఆమె బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులతో తరచుగా టచ్‌లో ఉన్నట్టు తేలింది. రియా చక్రవర్తి కాల్ డేటా ( Rhea Chakraborty's call data ) ఆధారంగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సీనియర్ ఫిలింమేకర్ మహేష్ భట్‌తో పలుసార్లు టచ్‌లోకి వచ్చినట్టు తేలింది. బాలీవుడ్ తర్వాత రియా కాల్ లిస్టులో ఉన్న పేర్లలో క్లీన్ ఇమేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ( Rana Daggubati ), టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) పేర్లు ఉన్నాయి. Also read : Lung cancer treatment: సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. ? అమెరికాలో చికిత్స ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియా చక్రవర్తి కాల్ డేటా ప్రకారం ఆమె రానా దగ్గుబాటికి ఏడుసార్లు ఫోన్ చేస్తే.. రానా నుంచి రియాకు నాలుగు కాల్స్ వెళ్లాయి. రియా నుంచి రకుల్ ప్రీత్ సింగ్‌కి ఏకంగా 30 సార్లు ఫోన్ చేయగా... రకుల్ ఆమెకు 14 సార్లు ఫోన్ చేసింది. మరో రెండుసార్లు వీళ్లిద్దరు ఒకరికొకరు మెసేజ్ కూడా చేసుకున్నారు. 


ఇక బాలీవుడ్‌తో రియా చక్రవర్తి కనెక్షన్స్ విషయానికొస్తే.. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కి రియా ఒకసారి ఫోన్ చేయగా... అమీర్ ఖాన్ ( Aamir Khan ) ఆమెకు మూడుసార్లు ఎస్ఎంఎస్ చేశాడు. ఆశిఖి 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కి ( Aditya Roy Kapoor ) రియా చక్రవర్తి 16 ఫోన్ కాల్స్ చేయగా.. అతడు ఆమెకు 7 ఫోన్ కాల్స్ చేశాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) నుంచి రియా కపూర్ ఫోన్‌కి రెండు కాల్స్ రాగా.. రియా నుంచి శ్రద్ధా నెంబర్‌కి మూడు ఫోన్ కాల్స్ వెళ్లాయి. Also read : Sanjay Dutt: కేజీఫ్ 2 మూవీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్


ఇటీవల మృతి చెందిన సరోజ్ ఖాన్‌కి ( Saroj Khan ) రియా మూడుసార్లు ఫోన్ చేయగా... ఆమె తిరిగి రెండుసార్లు రియాకు ఫోన్ చేశారు. ఇద్దరూ చెరొకసారి మెసేజ్ కూడా చేసుకున్నారు. 


లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బాలీవుడ్‌లో పేరొందిన ఫిలింమేకర్ మహేష్ భట్‌కి ( Mahesh Bhatt ) ఒక్క జనవరి నెలలోనే రియా చక్రవర్తి 9 ఫోన్ కాల్స్ చేయగా.. ఆమెకు మహేష్ భట్ 7 ఫోన్ కాల్స్ చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి మహేష్ భట్, కరణ్ జొహర్ లాంటి సినీ ప్రముఖులు నెపోటిజంను ( Nepotism in Bollywood ) ప్రోత్సహించడమే కారణం అంటూ సుశాంత్ అభిమానులు వారిపై సోషల్ మీడియా ద్వారా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. Also read : Rana Daggubati: అమూల్ నుంచి సర్‌ప్రైజ్


రియా చక్రవర్తి ఎవరితో టచ్‌లో ఉన్నారు ఎవరితో టచ్‌లో లేరు అనేది పూర్తిగా అది ఆమెకు, ఆమెతో టచ్‌లో ఉన్న వారికి సంబంధించిన వ్యక్తిగత విషయమే అవుతుంది. ఐతే, ఏదైనా ఒక కేసు విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కాల్ డేటాను పరిశీలించినప్పుడు.. ఆ కాల్ డేటా జాబితాలో ఉన్న వారితో ఆమెకు ఉన్న సంబంధం ఎలాంటిది ? వారితో ఆమెకు పడిన అవసరం ఎలాంటిది ? ఒక వ్యక్తితో ఎక్కువసార్లు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏమోచ్చింది అనే కోణంలోనే దర్యాప్తు బృందాలు విచారణను ముందుకు తీసుకెళ్లడం సహజం. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ( Sushant Singh Rajput death case ) విచారణలోనూ అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది.Also read : యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య


సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి కాల్ డేటాను ( Rhea Chakraborty’s Call Detail Record (CDR) ) పరిశీలిస్తున్న దర్యాప్తు బృందాలు సైతం ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైన నేపథ్యంలో ఈ పేర్లు వెలుగులోకి రావడం బాలీవుడ్ మీడియాలో ( Bollywood media ) చర్చనియాంశమైంది. రియా కాల్ డేటాలో క్లీన్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, సరోజ్ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు రావడం అనేది అది కేవలం వారితో ఒక సినీ నటిగా రియాకు ఉన్న స్నేహమే కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ఆయా సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే. Also read : Renu Desai: లగ్జరీ కార్లు అమ్మేస్తున్న రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా ?