Sanjay Dutt: కేజీఫ్ 2 మూవీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

KGF 2 మూవీ... దేశవ్యాప్తంగా యాక్షన్ చిత్రాలను అభిమానించే ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. కేజీఎఫ్ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుందని మనందరికి తెలిసిందే. కేజీఎఫ్ మూవీ ఎంతో ఆకట్టుకున్న నేపథ్యంలో ఇక ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న KGF chapter 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

Last Updated : Aug 12, 2020, 08:49 AM IST
  • చికిత్స కోసం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటానని ప్రకటించిన సంజయ్ దత్
  • కేజీఎఫ్ 2 మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్
  • ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 మూవీ
  • సంజయ్ దత్ బ్రేక్ కారణంగా మరింత వెనక్కి వెళ్లనున్న కేజీఎఫ్ 2 మూవీ విడుదల
Sanjay Dutt: కేజీఫ్ 2 మూవీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

KGF 2 మూవీ... దేశవ్యాప్తంగా యాక్షన్ చిత్రాలను అభిమానించే ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. కేజీఎఫ్ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుందని మనందరికి తెలిసిందే. కేజీఎఫ్ మూవీ ఎంతో ఆకట్టుకున్న నేపథ్యంలో ఇక ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న KGF chapter 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం కంటే కూడా భారి బడ్జెట్‌తో రూపొందుతున్న KGF sequel పై అభిమానుల్లో అంతే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. Also read : Lung cancer treatment: సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. ? అమెరికాలో చికిత్స ?

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దాదాపు ఇప్పటికే 90 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 23 న విడుదల కావాల్సి ఉంది. కాని ఇప్పుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో ఆయన కొన్నిరోజుల పాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కేజీఎఫ్ 2 మూవీ 2021 సంక్రాంతికి వాయిదా పడింది. Also read : యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య

కేజీఎఫ్ 2 మూవీలో అధీరగా సంజయ్ దత్ :
కేజీఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్ అధీర అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు ( Sanjay Dutt's role in KGF 2 ). ఇటీవలే సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2 మూవీ అధీర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ( Sanjay Dutt first look in KGF 2) విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ నేరుగా ఓ సౌతిండియన్ మూవీలో నటించడం ఇదే తొలిసారి కావడంతో అధీర ఫస్ట్ లుక్‌కి భారీ స్పందన లభించింది. కానీ ఇప్పుడిలా ఎవ్వరూ ఊహించనిరీతిలో సంజయ్ దత్ షూటింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి రావడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల మరింత వెనక్కి వెళ్లడం అనేది ఆ చిత్రం విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్ అయింది. 

సంజయ్ దత్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నప్పటికీ.. మిగతా యాక్షన్ పార్ట్స్‌కి సంబంధించిన షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. సంజయ్ దత్‌పై చిత్రీకరించాల్సి ఉన్న మిగతా సన్నివేశాలను ఆయన చికిత్స నుంచి తిరిగొచ్చాక షూట్ చేయనున్నట్టు సమాచారం. Also read : Renu Desai: లగ్జరీ కార్లు అమ్మేస్తున్న రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా ?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x