Tamannah parents: తమన్నా తల్లిదండ్రులకు కరోనా.. తమన్నాకూ కరోనా పరీక్షలు
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి అనంతరం కరోనా నివారణ కోసం లాక్‌డౌన్‌లు విధించడం... ఆ తర్వాత దశవలారీగా అన్‌లాక్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిపోయాయి కానీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గటం లేదు.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి అనంతరం కరోనా నివారణ కోసం లాక్‌డౌన్‌లు విధించడం... ఆ తర్వాత దశవలారీగా అన్‌లాక్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిపోయాయి కానీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గటం లేదు. అన్‌లాక్ 4 ( Unlock 4 ) దిశగా వెళ్తున్నప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా బారిన పడుతున్న వారిలో అక మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఐతే తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటం వల్ల ఎక్కడో ఒక చోట కొన్ని కేసులు క్లిష్టతరం అవుతున్నాయి తప్పితే మిగతా అందరూ కరోనా నుంచి తిరిగి కోలుకుంటున్నారు. Also read : Nani V Trailer: నాని V మూవీ ట్రైలర్ వచ్చేసింది
కరోనావైరస్ ( COVID-19 ) సోకిన వారి జాబితాలో తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తల్లిదండ్రులు ( Tamannah's parents tested positive for coronavirus ) చేరారు. ఈ విషయాన్ని స్వయంగానే తమన్నానే వెల్లడించింది. తన తల్లిదండ్రులకు కొద్దిపాటి లక్షణాలు కనిపించగా కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. ఈ పరీక్షల్లో వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తమన్నా తెలిపింది. తనకు కరోనా టెస్టు నెగెటివ్ వచ్చిందని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. Also read : OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా ?
మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలే మా అమ్మానాన్నలు త్వరగా కోలుకునేలా చేస్తాయని తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. Also read : Murder Movie Case: వర్మకు హైకోర్టులో ఊరట