Ram Gopal Varma's Murder Movie Case: హైదరాబాద్: తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలను ఆపాలని నల్లగొండ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నుంచి వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. మర్డర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణలపై మిర్యాలగూడ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. Also read: Murder Movie: వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’కు బ్రేక్
ఇదిలాఉంటే.. ఈ చిత్రాన్ని ఆపాలంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. దీన్నీ సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల