హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana assembly session ) ప్రారంభమైన మరుసటి రోజే అసెంబ్లీ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఆవరణలో పాస్‌లు జారీ చేసే కౌంటర్లో సేవలు అందించే సిబ్బందిలో ( Telangana assembly staff tested positive for COVID-19 ) ఒకరికి కరోనా సోకింది. దీంతో అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా భయం పట్టుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇలా కరోనా పాజిటివ్ కేసు బయటపడటం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగి నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విధుల్లో ఉండటంతో ప్రజాప్రతినిధులను సైతం కరోనా భయం వెంటాడుతోంది. Also read :  Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?


కరోనావైరస్ ( Coronavirus ) సోకిన సదరు ఉద్యోగితో ఎవరెవరు కాంటాక్టులోకి వచ్చారో వాళ్లందరి వివరాలు సేకరిస్తున్న అధికారులు.. వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. Also read :  Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?