Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ బారినపడిన వారిలో పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మంత్రి మల్లా రెడ్డి కూడా చేరారు.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ బారినపడిన వారిలో పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మంత్రి మల్లా రెడ్డి కూడా చేరారు. ఇటీవల మంత్రి మల్లా రెడ్డి ( Minister Malla Reddy ) కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. Also read: Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి
మంత్రి మల్లా రెడ్డికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులకు, గత కొద్ది రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెదిలిన వారికి అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, ఆయన భార్య, కుమారులకు ( LB Nagar MLA Sudheer Reddy's family ) కూడా కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. Also read: Employee vs Boss: బాస్ భార్యకి సెక్స్ టాయ్స్ గిఫ్టుగా పంపించిన ఉద్యోగి
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్తగా 2,256 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా 615 మంది చనిపోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది. Also read: Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?