AP 31 Movie First Look: చంటి, లహరి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం '#AP 31'. 'నెంబర్ మిస్సింగ్' ట్యాగ్ లైన్.  కె.వి.ఆర్ దర్శకత్వంలో నారాయణ స్వామి.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలీమ్ మాలిక్ (మ్యాక్) అడిషనల్ స్క్రీన్ ప్లే అందించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత త్రినాథ రావు నక్కిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ని ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో హీరో చంటి, హీరోయిన్ లహరి, దర్శకుడు కె.వి.ఆర్ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ "నాది, బెక్కెం వేణు గోపాల్ గారి కెరీర్ స్టార్ట్ అయ్యింది చిన్న సినిమా నుంచే. అప్పుట్లో మా సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ లను ఎవరు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. 


ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా స్టార్టింగ్ కెరీర్ ను మరచిపోకూడదు కదా. అందుకనే ఎవరైనా సపోర్ట్ కావాలని మమ్మల్ని అడిగితే మా వంతు సపోర్ట్ చేయటానికి, ఎంకరేజ్ చేయటానికి మేం ఎప్పుడూ వెనుకాడం. అయినా ఇప్పుడు చిన్న, పెద్ద సినిమాలనేం లేదు. సక్సెస్ అయితే చాలు. రీసెంట్ గా రిలీజైన బేబి సినిమానే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక సినిమా విషయానికి వస్తే '#AP 31' అనేది వైజాగ్ బండి. ఈ సినిమాను తెలుగు, తమిళంలోనూ విడుదల చేస్తున్నారు.


అంటే ఆంధ్రాలో స్టార్ట్ అయిన ఈ బండి తమిళనాడు వరకు వెళ్లాలి మరి. సినిమా ఆ రేంజ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నేను రెండు, మూడు సార్లు సినిమా సెట్స్ కి వెళ్లాను. నిర్మాత నారాయణ స్వామిగారు మేకింగ్ లో అస్సలు కాంప్రమైజ్ కావటం లేదు. ఏం చేసినా బాగా చేస్తామని డిసైడ్ అయ్యి మరీ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కె.వి.ఆర్ సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారని మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక హీరో చంటి చాలా కష్టపడి సినిమాను చేశారు. ఇక లహరి కూడా గ్లామర్ గా కనిపిస్తోంది. సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. 
ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ "ప్రతీ ఏడాది ఎంతో మంది కొత్త దర్శకులు, నిర్మాతలు వారి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వారిలో కొందరే మట్టిలో మాణిక్యాలుగా వెలుగుతున్నారు.


Also Read: BRS MLA Tickets: అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బిగ్‌ ట్విస్ట్..! ఆ స్థానాల్లో మళ్లీ మార్పు..?   


అలాగే .'#AP 31' సినిమా డైరెక్టర్, నిర్మాతలు ఇండస్ట్రీలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా పెద్ద హిట్ అయ్యి.. వారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోలు కావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ కొంత మంది మాత్రమే హీరోలు మన ముందుకు వస్తుంటారు. ఇప్పుడు చంటి కూడా అలా హీరోగా మన ముందుకు వచ్చారు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. భాష్య శ్రీ ఈ సినిమాకు మాటలు, పాటలు అందించటం మంచి విషయం. లహరి గ్లామరస్ హీరోయినే కాదు.. మంచి పెర్ఫామర్ కూడా. తను ఇంకా మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను" అన్నారు. 


రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ "'#AP 31' చాలా మంచి స్క్రిప్ట్. ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. చాలా బాగా వచ్చింది. నిర్మాత నారాయణ స్వామిగారైతే ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. హీరో చంటిగారు, హీరోయిన్ లహరిగారికి ధన్యవాదాలు. ఎంటైర్ టీమ్ కి ధన్యవాదాలు" అన్నారు. 


హీరో చంటి మాట్లాడుతూ " నిర్మాత నారాయణ స్వామిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ కె.వి.ఆర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ గారు, స్క్రీన్ ప్లే రైటర్ మ్యాక్ గారు ఇలా అందరూ బాగా కష్టపడుతున్నాం. భాష్యశ్రీగారు ప్రతి డైలాగ్, పాటను చక్కగా రాశారు. లహరి చాలా గొప్ప పెర్ఫామర్. తను అబ్బాయిలతో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. చాలా సపోర్ట్ చేసింది. తనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నారు. 


Also Read: BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్


చిత్ర దర్శకుడు కె.వి.ఆర్ మాట్లాడుతూ "సినీ ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉంటున్నాను. నాలుగేళ్ల నుంచి నిర్మాత నారాయణ స్వామిగారితో పరిచయం ఉంది. 2019లోనే ఆయన నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే సినిమాను చేస్తున్నారు. అది కూడా భారీగా చేస్తున్నారు. మంచి నటీనటులు, టెక్నీషియన్స్ ను ఇచ్చి సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్, డైలాగ్ రైటర్ భాష్యశ్రీ అందరూ సూపర్ ఔట్ పుట్ ఇచ్చారు. ఇక దర్జా సినిమా నుంచి పరిచయం ఉన్న సలీం మాలిక్ గారు అడిషనల్ స్క్రీన్ ప్లే అందించారు. ఇక హీరో చంటిగారిని స్క్రీన్ పైన చూస్తుంటే ఫస్ట్ టైమ్ హీరోలా అనిపించరు. అంత చక్కగా నటించారు.


లహరిగారు చాలా డేడికేషన్ తో వర్క్ చేశారు. అద్భుతంగా నటించారు. అందరి సపోర్ట్ తో సినిమాను కూల్ గా పూర్తి చేస్తున్నాం. ఇంత మంచి టీమ్ ని నాకు ఇచ్చిన నిర్మాత నారాయణ స్వామిగారికి థాంక్స్" అన్నారు. 
లహరి మాట్లాడుతూ "మా టీమ్ ను సపోర్ట్ చేయటానికి వచ్చిన త్రినాథ రావుగారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి థాంక్స్. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి చేసిన సినిమా ఇది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కె.వి.ఆర్ గారికి, నిర్మాత నారాయణ స్వామిగారికి థాంక్స్ " అన్నారు. 


చంటి, లహరి, వినోద్ కుమార్, తులసి, జయసుధ, షియాజీ షిండే, బాబు మోహన్, పృథ్వీరాజ్, పాకీజా, స్వర్ణలత తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతాన్ని, గోపాల కృష్ణ సినిమాటోగ్రఫీని, భాష్యశ్రీ మాటలు, పాటలను, సలీమ్ మాలిక్ అడిషనల్ స్క్రీన్ ప్లే అందించారు. అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు స్టంట్ మాస్టర్స్ గా చేసిన కనల్ కన్నన్, జాషువా ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్స్ శేఖర్ వి.జె, గణేష్ స్వామి, భాను, జిత్తు, అని మాస్టర్స్ ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేశారు.


Also Read: Grapes Benefits: రోజూ ద్రాక్ష పండ్లు తింటే..కేన్సర్ సహా ఈ 5 రకాల వ్యాధులు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి