రాంచరణ్, కియారా అద్వాని జంటగా నటించిన వినయ విధేయ రామ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాట విడుదల చేసిన మేకర్స్ తాజాగా కొద్దిసేపటి క్రితమే తస్సాదియ్య అనే రెండో పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఇరగదీసే బీట్స్‌తో వినసొంపుగా వున్న తస్సాదియ్య సాంగ్ వింటుంటే.. సినిమాలో ఈ పాటకు చెర్రీ స్టెప్స్ కూడా అంతే జోష్‌లో ఉంటాయనిపిస్తోంది. ఇప్పటికే ఈ పాటపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యేలా గత మూడు రోజుల నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్. శ్రీమణి రాసిన ఈ పాటకు డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేయగా జస్ప్రీత్ జస్ తన వాయిస్ అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన కనిపించిన సంగతి తెలిసిందే.