ముంబై: ముంబైలోని విలే పార్లేలోని సమాజ సేవ స్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీదేవి అంతిమయాత్రకు తారాలోకం కదిలి వచ్చింది. జావేద్ అక్తర్, షబానా ఆజ్మీ, షారుఖ్ ఖాన్, ప్రశూన్ జోషి, రందీర్, రాజీవ్ కపూర్, అనుపమ్ ఖేర్, గుల్జార్, మహేష్ భూపతి, లారాదత్తా తదితర నటులు అంత్యక్రియలకు హాజరయ్యారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి కోరిక మేరకే ఆమె అంతిమయాత్రకు ఉపయోగించే వాహనం మొత్తం వివిధ రకాల తెల్లపూలతో అలంకరించారు. గౌరవ సూచికగా ఆమె పార్థివదేహానికి త్రివర్ణ పతాకం కప్పారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగనుంది. 



అంతకు ముందు ముంబై లోఖండ్వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసం నుంచి శ్రీదేవి పార్థివదేహాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కి తరలించారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మలీవుడ్ లతో పాటు ఇతర సినీఇండస్ట్రీ ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు. వీరితోపాటు వేలాది మంది అభిమానులు శ్రీదేవిని కడసారి చూసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ముంబై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 


మధ్యాహ్నం వరకు ఆమె భౌతికకాయాన్ని సందర్శించుకోవడానికి అనుమతిచ్చారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ప్రకటించినట్లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. టాలీవుడ్ నటుడు చిరంజీవి, వెంకటేష్, విలక్షణ నటుడు కమల్ హసన్, జయప్రద, హేమామాలిని, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్, సుస్మితా సేన్, ఇషా డియోల్, సంజయ్ కపూర్, ఫరాఖాన్, సోనమ్ కపూర్ తదితర సినీ ప్రముఖులు సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కి చేరుకొని శ్రీదేవికి నివాళులు అర్పించారు.



 



 




 



 



 



 



 



 



 



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న అశుతోష్ గౌరీకర్, ప్రకాశ్ రాజ్, కిరణ్ రావ్, సారా ఆలీఖాన్, అర్జున్ కపూర్







శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, సినీ నిర్మాత అశ్వినీ దత్ 



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న నటి రబీనా టాండన్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న జావేద్ అక్తర్, షబానా ఆజ్మీ



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న వైభవి మర్చేంట్



 


శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న సోహ అలీ ఖాన్, నేహా ధూపియా



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న దీపికా పదుకొనే, సిద్దార్థ్ మల్హోత్రా



 


శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న ఆదిత్యా రాయ్ కపూర్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న విద్యాబాలన్, భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న నటి రేఖ



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న సినీ దర్శకుడు సంజయ్ లీలా భాన్సలి



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న నటుడు జాన్ అబ్రహం



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న రాజ్ కుమార్ రావ్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్, కాజోల్, అజయ్ దేవగన్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న సినిమాటోగ్రాఫర్ సరోజ్ ఖాన్, జయాబచ్చన్, మాధురీ దీక్షిత్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న సుష్మితా సేన్, ఐశ్వర్యరాయ్ 



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న హేమా మాలిని, ఇషా డియోల్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు: సంజయ్ కపూర్, రియా కపూర్, హర్షవర్దన్ కపూర్



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు బయట ఉన్న అభిమానులు  



శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబై స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్న ఫిలింమేకర్ ఫరాహ్ ఖాన్, నటి సోనమ్ కపూర్