టాలీవుడ్ హీరో నితిన్ తన వివాహ వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి, దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా మార్చి 30న పుట్టినరోజు వేడుకను జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దాంతో పాటుగా ఏప్రిల్ 16వ తేదీన జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుగు ప్రజలకు, అభిమానులకు హీరో నితిన్ తెలిపారు. ఈ విషయాలను ప్రకటనలో పేర్కొన్నారు.  ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తన వంతుగా టాలీవుడ్ నుంచి విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న తొలి నటుడు నితిన్ కావడం గమనార్హం. సామాజిక అంశాలపై స్పందించే నితిన్, తొలి విరాళం రెండు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు ప్రకటించిన అనంతరం ఇతర నటులు తమ వంతు సాయాన్ని ప్రకటించడం తెలిసిందే.  బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!


నితిన్ ప్రేమ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. షాలిని అనే అమ్మాయిని ప్రేమించారు. ఆయన ప్రేమ సక్సెస్ అయింది. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో వీరి నిశ్చితార్థ వేడుక కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16 దుబాయ్ వేదికగా నితిన్, షాలినిలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో వేడుకను వాయిదా వేసుకున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


 హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ