టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై అర్జున్ రెడ్డి నిర్మాత కమలాకర్ రెడ్డి (Producer Kamalakar Reddy Dies) మరణించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న తండ్రి సైతం చనిపోవడం ఆ నిర్మాత కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కరోనా సోకిన తన తండ్రి నందగోపాల్ రెడ్డిని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుం డగా  బుధవారం ఈ విషాదం జరిగింది. Singer Malavika: సింగర్ మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా


నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు. నెల్లూరులో కొన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నల్గగొండ జిల్లా కొండప్రోలు వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే నిర్మాత కమలాకర్ రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డి మరణించారు. తీవ్రంగా గాయపడ్డ అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Final IPL 2020: ఈ క్రికెటర్లకు ఐపీఎల్ 2020నే చివరిది కావొచ్చు!