ఒక వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో వైపు తమిళ స్టార్ హీరో విజయ్. వీరి సరసన నటించేందుకు ఎవరైనా ఛాన్స్ వదులు కోరు. అయితే ఈ ఇద్దరితో నటించేందుకు ఒకే సమయంలో ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ అయినా డిసైడ్ చేయడం కష్టమే..సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైంది రష్మికకు.. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లో వెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే టైంలో రెండు బంపర్ ఆఫర్లు  !!
టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మికకు ఒకే సమయంలో రెండు పెద్ద ఆఫర్లు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా ఫిక్సయింది రష్మిక . ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉంది. అయితే మరోపక్క ఇదే టైమ్ పీరియడ్ లో సెట్స్ పైకి రానున్న తమిళ స్టార్ విజయ్ తో కొత్త సినిమాలోను రష్మికకి ఆఫర్ దొరికింది. పైగా ఒకే టైంలో ఘూటింగ్ షెడ్యూల్ ఉంది. దీంతో రష్మిక ఈ రెండు ఆఫర్స్ ని వదులుకోకుండా ఎలా మ్యానేజ్ చేయాలా..? అనే ఆలోచనలో పడింది.


ప్చ్ విజయ్ ను వదులుకుంటే కష్టం !!
ఇప్పటి వరకు రష్మికకు తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు రష్మిక. ప్రస్తుతం కార్తీ కొత్త సినిమాతో సెట్స్ పై ఉంది. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సెకండ్ మూవీకే విజయ్ సరసన అంటే… ఇక కోలీవుడ్ లో కూడా రష్మికకి తిరుగుండదు. అలాగని ఇక్కడ సూపర్ మహేష్ బాబు సినిమాకి నో చెప్పగలదా..? అంత ఈజీ కాదు. 


ప్చ్ అలాగని మహేష్ వదులకుంటే భారీ నష్టం !!
సూపర్ స్టార్ మహేష్ బాబు సరనన నటించాలంటే ఏ హీరోయిన్ కి అయినా రాసిపెట్టి ఉండాలి. మహేష్ సరనన ఛాన్స్ అంటే హీరోయిన్స్ అయినా ఎగిరి గంతులేస్తారు. ఒక్క మూవీలో మహేష్ సరసన నటిస్తే టాలీవుడ్ ఊహించని రేంజ్ కు వెళ్లిపోవచ్చు. అలా మహేష్ బాబు వైపు మొగ్గు చూపితే తమిళంలో రాక రాక వచ్చిన బంపర్ ఆఫర్ వదులుకున్నట్లే మరి. 


రష్మిక విషయంలో సీన్ రివర్స్...!!
చాలా మంది హీరోయిన్స్ కు  అవకాశాలు దొరక్క నానా కష్టాలు పడుతుంటే..ఒకే సారి రెండు బంపర్ ఆఫర్లు వచ్చి పడితే ఏం చేయాలనే తెలియక దిగులు చెందుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలివిగా 2 సినిమాల్లో ఏదీ చేయి జారకుండా మ్యానేజ్ చేసుకుంటుందా..? లేక మహేష్ బాబు, విజయ్ లలో ఎవరో ఒకరినే ఎంచుకుంటుందా..? మలయాళి బ్యూటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో..?  మరి.