ఎన్టీఆర్ బయోపిక్ గా తెరపైకి వస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దర్శకుడు వర్మ.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోట్ కోసం మరిన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సినిమాపై స్పందించారంటూ ఓ వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్మ తీసిన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయమేంటి ?" అని ఓ రిపోర్టర్ ట్రంప్ కు ప్రశ్నించగా ప్రతి ఒక్కరూ దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారని... ఇది చర్చించాల్సిన అంశమేనన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలనిపిస్తోందంటూ ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ఉంది .  వర్మ తన ట్విట్టర్ లో పోస్టు చేసిన మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది


వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఓ సందర్భంలో  ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విజువల్స్ కు వర్మ  ఈ ప్రశ్నలు జోడించి ఈ వీడియోను ఎడిటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఫన్నీగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.