Sayadev -Krishnamma: కమర్షియల్ సినిమా అయినా.. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అయినా.. అందరి ఠక్కున గుర్తుకు వచ్చేది హీరో సత్యదేవ్. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నారు.  అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ.. ''రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా ఇది. టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినపుడు అంతరికీ అర్దమవుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు సత్యదేవ్‌. ఈ సినిమాతో  కచ్చితంగా మరో రేంజ్‌కి చేరుకోవడం ఖాయం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ''స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపించనున్నాము. ఇవి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్నారు.   టైటిల్‌ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించామన్నారు.  ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు.  ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుందని చెప్పారు.  ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.   లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన అతీరా రాజ్ జోడిగా నటించింది.  లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు యాక్ట్ చేశారు.


సాంకేతిక వర్గం విషయానికొస్తే.. సమర్పణ -  కొరటాల శివ, బ్యానర్ - అరుణాచల క్రియేషన్స్, నిర్మాత - కృష్ణ కొమ్మలపాటి, రచన, దర్శకత్వం - వి.వి.గోపాలకృష్ణ, సంగీతం - కాల భైరవ, సినిమాటోగ్రఫీ - సన్నీ కూరపాటి, ఎడిటర్ - తమ్మిరాజు, ఆర్ట్ - రామ్ కుమార్, పాటలు - అనంత శ్రీరాం, ఫైట్స్ - పృథ్వీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవి సూర్నెడ్డి, పి.ఆర్.ఒ - వంశీ కాకా.


Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook