అడవి జంతువులను ఎంతలా పెంచి పోషిస్తున్నా.. వాటితో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితే ఎదురైంది దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్ పార్క్ యజమానికి. రోజూ తాను ప్రేమగా చూసుకుంటున్న సింహమే కదా.. దాని మూడ్ డిస్టర్భ్ చేసినా ఏమీ కాదులే అనుకున్నాడు. అలా అనుకొనే అది మంచి కోపంతో ఉన్నప్పుడు ఎన్‌క్లోజర్‌లోకి అడుగుపెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకేముంది.. ఆ అడవి జంతువుకి క్రోధం నషాలానికెక్కింది. తన యజమాని అని కూడా చూడకుండా దాడి చేసింది. అలా దాడి చేయడం మాత్రమే కాదు.. పొదల్లోకి లాక్కొని వెళ్లిపోయింది. తర్వాత మెడ భాగంలో కరిచేసింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో జూ సిబ్బంది వచ్చి చాకచక్యంతో సింహాన్ని, అతనితో వేరు చేశారు. తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఎంత ప్రేమగా చూసుకున్నా, క్రూరజంతువుల పట్ల వాటి శిక్షకులు అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో చూసిన పలువురు సైకాలజిస్టులు కామెంట్లు పెట్టారు. క్రూర జంతువులకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని.. ముఖ్యంగా జంతువుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని.. వాటి ప్రవర్తనను అంచనా వేయాల్సి ఉంటుందని ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ శిక్షకులు తెలిపారు.