ఆ టెన్షన్ తో నిద్రపట్టడం లేదంటున్న విజయ్ దేవరకొండ !!
హీరో విజయ్ దేవరకొండకు ఏమైంది.. అతనికి నిద్రపట్టకుండా చేస్తున్న ఆ టెన్షన్ ఏంటనేదేగా మీ టెన్షన్.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది
భరత్ కమ్మ డైరక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. నాలుగు సౌత్ భాషల్లో ఈ మూవీని ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. మూవీ ప్రమోషన్ లోనూ మంచి రెస్సాన్స్ వస్తోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
సినిమా డేట్ దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోను విజయదేవర కొండ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో బీజీగా ఉన్న విజయ్ దేవరకొండకు టెన్షన్ తో వారం రోజులుగా నాకు నిద్రపట్టడం లేదట. ఈ మూవీ గురించి వియజ్ దేవరకొండ మాట్లాడుతూ గతంలో తాను చేసిన సినిమాల రిలీజ్ రోజున రాత్రంతా ప్రశాతంగా నిద్రపోయి మధ్యాహ్నం 12 గంటలకి నిద్రలేచిన సందర్భాలు గుర్తు చేసుకున్నాడు.
'డియర్ కామ్రేడ్' మాత్రం ఏడాది పాటు మా చేతిలో వుండి బయటికి వెళుతుండటంతో టెన్షన్ గా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ టెన్షన్ తో రాత్రుళ్లు తనకు నిద్రపట్టడం లేదంటున్న విజయ్ దేవరకొండ..వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి అంటూ బావోద్వేగాన్ని ప్రదర్శించాడు.