విడుదలకు ముందే రికార్డుల బాట పట్టిన రామ్ చరణ్ `వినయ విధేయ రామ`
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వినయ విధేయ రామ`.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే "వినయ విధేయ రామ". ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈ టీజర్ 24 గంటలలోనే 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్ సాధించడం గమనార్హం. శ్రీమతి డి.పార్వతి సమర్పిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.
‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్ చేస్కో’... ఇదీ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ టీజర్‌లో చెప్పే తొలి డైలాగ్. ‘రేయ్.. పందెం పరశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్..రామ్..రామ్ కొణిదెల’ అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌కి అప్పుడే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటించిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించడం గమనార్హం.
నవంబర్ 9 నుండి ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభిస్తామని దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ, ఆర్థర్ ఏ విల్సన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కనల్ కన్నన్ ఈ చిత్రానికి స్టంట్స్ సమకూరుస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనరుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తమిళ నటుడు ప్రశాంత్‌తో పాటు ఆర్యన రాజేష్, స్నేహ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.