Viral Video: గాలిలో హెలికాప్టర్ నుంచి వేలాడుతూ పులప్స్ చేయడం అసాధ్యం. కానీ అలాంటి పని చేసి చూపించారు ఇద్దరు యూట్యూబర్లు. హెలికాప్టర్ నుంచి వేలాడుతూ నిమిషంలో అత్యధిక పులప్స్ చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 2022 జూలై 6న బెల్జియంలోని ఎయిర్‌పోర్టులో నెదర్లాండ్‌కు చెందిన స్టాన్ బ్రౌనీ, ఆర్జెన్ ఆల్బర్స్‌ అనే యూట్యూబ్ ఛానల్ ప్రజెంటర్లు ఈ రికార్డును బద్దలు కొట్టారు. ఆర్జెన్ మొదటి హెలికాప్టర్ నుంచి 24 పులప్స్ చేశాడు. దీంతో ఆర్మేనియన్ సీరియల్ రికార్డ్ బ్రేకర్ రోమన్ సహ్రాడియన్ నెలకొల్పిన 23 పులప్స్‌ను బ్రేక్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం కాలిస్టెనిక్స్‌లో స్పెషలిస్ట్ అయిన స్టాన్ బ్రూయింక్ నిమిషంలో 25 పులప్స్ చేసి దానిని అధిగమించాడు. యూట్యూబ్‌లో ఫిట్‌నెస్ ఛానల్‌తో స్టాన్‌ బ్రౌనీగా బ్రూనింక్ పాపులర్ అయ్యాడు. ఎగురుతున్న హెలికాప్టర్‌ నుంచి పులప్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. కామెంట్లు సైతం ఇస్తున్నారు. విపరీతమైన గాలి, భయంకరమైన ధ్వని మధ్య ఇలా చేయడం మాములు విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. 


వేగంగా వెళ్తున్న హెలికాప్టర్ నుంచి పులప్స్ చేసి ఇద్దరు అదుర్స్ అనిపించారు. ఇలా ఫీట్స్ చేయడం గతంలోనూ ఉంది. ఒక్క నిమిషం 30 సెకన్లలో కదులుతున్న కారు టైర్‌ మార్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒక్క నిమిషం 13 సెకన్లలోనే కారు టైర్ మార్చి ఆ రికార్డును ఇద్దరు ఇటాలియన్లు బ్రేక్ చేశారు. 



Also read:Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్..మరోసారి జ్యుడిషియల్ కస్టడీ..!


Also read:Muralidhar Rao: త్వరలో టీఆర్ఎస్‌లో భూకంపం..గులాబీ దళంపై మురళీధర్‌రావు హాట్ కామెంట్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook