కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఆరోపణలు అదానీ గ్రూప్‌పై ఉన్నాయి ఇప్పుడు. ఈ ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్, ప్రపంచంలో మూడవ అత్యంత ధనికుడైన వ్యక్తి ఏ విధంగా అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు అనే శీర్షికతో పరిశోధన ప్రచురితమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ దశాబ్దాలుగా బహిరంగంగా షేర్ల విలువల్లో అవకతవకలకు పాల్పడటం, ఎక్కౌంటింగ్ మోసాలు చేసిందని ఆరోపణలున్నాయి. ఈ రిపోర్ట్ వెలుగు చూసిన తరువాత అదాన్ గ్రూప్ 4.1 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ క్లియర్ అయింది. ఇంతకీ హిడెన్‌బర్గ్ రీసెర్చ్ ఏంటనేది పరిశీలిద్దాం..


హిండెన్‌బర్గ్ నేపధ్యం ఇదే


ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ లేదా ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్. ఈ సంస్థ క్రెడిట్, డెరివేటివ్స్‌పై విశ్లేషణాత్మక నివేదికలు ఇస్తుంటుంది. ఈ కంపెనీ సీఎఫ్ఓ నాథన్ ఆండర్సన్.  2017లో న్యూయార్క్‌లో ఈ కంపెనీ స్థాపించారు. కంపెనీ తనను తాను యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్‌గా చెప్పుకుంటుంది. షార్ట్ సెల్లింగ్ అంటే ఏదైనా స్టాక్, సెక్యూరిటీ లేదా కమోడిటీ సెల్లింగ్‌ను ట్రిగ్గర్ చేయడం తద్వారా డెలివరీ టైమ్ కంటే ముందే దాని ధర తగ్గితే..ఆ వస్తువును లేదా స్టాక్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం. అంటే కంపెనీ బహిరంగంగానే ఏదైనా కంపెనీని టార్గెట్ చేసి అందులోని లోపాల్ని బయటకు తీస్తుది. ఆ తరువాత ఆ కంపెనీ షేర్లు పడిపోతే..వాటిని కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తుంది.


2 రోజుల్లో 25 శాతం పడిపోయిన షేర్లు


అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా వెలువడిన రిపోర్ట్‌లో గ్రూప్ షేర్ విలువ 85 శాతం తగ్గవచ్చని పేర్కొంది. అందుకు తగ్గట్టుగానే రిపోర్ట్ వెలువడిన 2 రోజుల్లోనే కంపెనీ షేర్ విలువ 25 శాతం పడిపోయింది. 2020 తరువాత కంపెనీ ఇప్పటి వరకూ 30 రిపోర్టులు బహిర్గతం చేసింది. ఈ 30 కంపెనీల స్టాక్ రిపోర్ట్ పరిశీలిస్తే..వాటి షేర్లలో దాదాపు 15 సాతం వరకూ క్షీణత నమోదైంది. అటు 6 నెలల్లో దాదాపు 26 శాతం పడిపోయాయి. 2020లో నోకియా కంపెనీపై రిపోర్ట్ వెలువరించిన తరువాత..ఆ కంపెనీ షేర్లు ఏకంగా 94 శాతం పడిపోయాయి.


ఈ సంస్థకు వ్యతిరేకంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ భారీగానే ఉంది. కంపెనీ రిపోర్ట్ అనంతరం షేర్ల ధరలు పడిపోతున్నాయి. SCWORX అనే ఓ కంపెనీపై రిపోర్ట్ వచ్చిన తరువాత మారునాడే ఆ కంపెనీ షేర్లు 3.3 శాతం పడిపోయాయి. ఆ తరువాత 3 నెలల్లోనే 90 శాతం పడిపోయాయి. మరోవైపు Genius Brand కంపెనీకు వ్యతిరేకంగా రిపోర్ట్ వెలువడిన తరువాత ఆ కంపెనీ షేర్ 13.4 శాతం పడిపోయింది. 3 నెలల తరువాత 85 శాతం పడిపోయాయి. Ideanomic కంపెనీ షేర్ 40 శాతం పడిపోయింది. 3 నెలల్లో 64 శాతానికి చేరుకుంది. 


Also read: Budget 2023 Expectations: ఇన్‌కంటాక్స్ స్లాబ్, హెచ్ఆర్ఏ రూల్స్ మార్పు ఉంటుందా, బడ్జెట్‌పై ఉద్యోగులు ఏం ఆశిస్తున్నారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook