చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 19వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. అసలే జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ కరోనా మహమ్మారిని దీటుగానే ఎదుర్కొంటున్నా.. ఎక్కడో ఓ మూల భయం మాత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ని జరుగుతున్నా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం తన పంథాను వీడటం లేదు. కరోనా వైరస్‌పై మొదట్నుంచీ సెటైర్లు వేస్తున్న వర్మ తాజాగా మరో ట్వీట్ వదిలాడు. ఈసారి కాస్త భిన్నంగా ప్రాణాలు హరిస్తున్న కరోనా వైరస్‌కు, దేవుడికి పోలిక పెట్టేశాడు మరి. దేవుడికి, కరోనా వైరస్‌కు తేడా ఏంటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానం కూడా విలక్షణ రీతిలో ఇచ్చాడు. దేవుడు ప్రతి జీవిని ఓకేతీరుగా చూడడని, అయితే కరోనా మాత్రం ప్రతి ఒక్కరినీ ఒకే తీరుగా చూస్తుందని సెటైర్ ట్వీట్ పేల్చేశాడు వర్మ.  హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos



కాగా, భారత్‌లో ఇప్పటికే కరోనా కాటుకు 11మంది బలైపోయారు. మరో 550 మందికి పాజిటీవ్‌గా తేలింది. ఇలాంటి వైరస్‌ను దేవుడితో వర్మ పోల్చడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వోడ్కా నాలుగో పెగ్గా అని ఓ నెటిజన్ పన్నీగా స్పందించాడు. దేవుడికి కోపం వస్తే కరోనాను పంపిస్తాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..