సాధారణంగా చిన్నారులు తమ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా, నాన్నను డ్రెస్ కోసం తీసుకెళ్లా. నచ్చిన వంటకాలు చేయించుకుని అమ్మ చేతి కమ్మనైన వంట తినాలని పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకు, పెద్దవారికి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 29న పుట్టినవారి పరిస్థితి ఏంటి. మామూలు రోజుల్లోనే పుట్టినవారు అదే రోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. బంధువులు, మిత్రులు, చుట్టుపక్కల వారిని పిలిచి కేక్ కట్ చేసి సంబరంగా పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ లీపు సంవత్సరంలో లీప్ డే రోజు అదేనండీ ఫిబ్రవరి 29న పుట్టినవారు బర్త్ డే ఎలా చేసుకుంటారా అని చాలా మందిలో ఏదో తెలియని ఆసక్తి దాగి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: లీప్ ఇయర్ అంటే ఏమిటి. ఫిబ్రవరిలో 29 తేదీ ఎలా?


లీప్ డే (ఫిబ్రవరి 29న) పుట్టినవారిని లీప్‌లింగ్స్ (Leaplings), లీపర్స్ (Leapers), లీప్‌స్టర్స్, లీప్ డే బీబిస్ అని పలు రకాలుగా పిలుచుకుంటారు. న్యూజిలాండ్ విషయానికొస్తే ఫిబ్రవరి 29న పుట్టినవారు  అధికారికంగానే ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. యూకే విషయానికొస్తే ఒకరోజు ఆలస్యంగా బర్త్ డే సెలబ్రేషన్ ఉంటుంది. మార్చి 1న పుట్టినరోజు జరుపుకుంటారు. భారత్‌లోనూ తమ నచ్చిన తీరుగా ఈవెంట్ చేస్తున్నారు.


See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ!


Also Read: వామ్మో .. మార్చిలో బ్యాంకులకు అన్ని సెలవు దినాలా? 


మన దేశంలో కొందరేమో ఫిబ్రవరి 28న సాయంత్రం లేక రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటే.. మరికొందరు బర్త్ డే చేసుకోవడం లేదు. తమ పుట్టినరోజు జరుపుకునేందుకు నాలుగేళ్లపాటు ఎదురుచూస్తున్నారు. తమ వయసు ఎంత అని అడిగితే మాత్రం లీపు సంవత్సరాలను మాత్రమే లెక్కించి గొప్పగా చెప్పుకుంటారు. ఉదాహరణకు 64ఏళ్ల పెద్దావిడను నీ వయసెంతని అడిగితే.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అని గర్వంగా, సంతోషంగా చెప్పడం చూస్తూనే ఉంటాం.


Also Read: పుట్టింది ఫిబ్రవరి 29న.. మరి బర్త్ డేల సంగతేంటి?


Also Read: లీపు సంవత్సరంలో భారతీయులు దర్శించే ప్రాంతాలివే!


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..