రామ్‌గోపాల్‌వర్మ `జీఎస్టీ` విషయంలో.. కత్తిమహేష్ పై మాటల దాడి
రామ్‌గోపాల్‌వర్మ మియా మాల్కోవా అనే హాలీవుడ్ పోర్న్ స్టార్ పై తీస్తున్న `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్` అనే ఆన్లైన్ చిత్రం విషయంలో కొంత పాజిటివ్ భావనతో ఉన్నారన్న విషయంలో ప్రముఖ చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ పై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాటల దాడి చేశారు పలువురు మహిళా సామాజికవేత్తలు.
రామ్‌గోపాల్‌వర్మ మియా మాల్కోవా అనే హాలీవుడ్ పోర్న్ స్టార్ పై తీస్తున్న "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే ఆన్లైన్ చిత్రం విషయంలో కొంత పాజిటివ్ భావనతో ఉన్నారన్న విషయంలో ప్రముఖ చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ పై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాటల దాడి చేశారు పలువురు మహిళా సామాజికవేత్తలు. కత్తి మహేష్, రామ్‌గోపాల్‌వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూలో కూర్చుని ఆ చిత్రంపై కొంత సమర్థనీయంగా మాట్లాడడంపై వారు అభ్యంతరం తెలిపారు. అయితే తన మాటలను మరోలా అర్థం చేసుకోవద్దని.. తను గతంలో కూడా ఆర్జీవి చిత్రాలను విమర్శించిన దాఖలాలు ఉన్నాయని.. ఈ చిత్రం కూడా చూస్తే తప్పించి ఏమీ మాట్లాడలేమని ఆయన అన్నారు.
ఒకవేళ అదిపూర్తి స్థాయిలో మహిళలను కించపరిచేలా ఉంటే తాను సైతం దానిని సమర్థించనని ఆయన చెప్పారు. బాడీ షేమింగ్ గురించి గతంలో వ్యతిరేకించిన కత్తి మహేష్.. ఈ సమయంలో మహిళల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తిస్తున్నారని కూడా పలువురు మహిళా సామాజికవేత్తలు తెలిపారు. లైంగిక స్వేచ్ఛ గురించి పురుషులు మాట్లాడక్కర్లేదని వారు తెలిపారు. ఆర్జీవి ఈ చిత్రం పేరుతో లైంగిక దోపిడి చేస్తే తాము సమర్థించమని వారు పేర్కొన్నారు. దీనికి కత్తి మహేష్ స్పందిస్తూ.. ఆ చిత్రాన్ని చూస్తే తప్పించి ఏం మాట్లాడలేమని.. ఆర్జీవి సైతం హద్దులు మీరి ప్రవర్తిస్తే దానిని అందరూ ఖండించాల్సి ఉందని.. ఆయన మాట్లాడిన ప్రతీ మాటకి తాను అవునని చెప్పలేదని.. తనకు కూడా ఆ విషయంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.