మొబైల్‌లో App డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సాధారణంగా మనం రేటింగ్ పై దృష్టి పెడతాం. రేటింగ్ ఏది బాగుంటే దాని పనితీరు బాగుటుందని అంచనాకు వస్తాం.. రేటింగ్, రివ్యూలను ప్రామాణికంగా తీసుకొని App ను ఎంచుకుంటాం.  అయితే అన్ని సార్లు ఇదే ప్రామాణికంగా  తీసుకోవడం మంచిదికాదంటున్నారు విశ్లేషకులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలీవలికాలంలో స్మార్ట్ ఫోన్ ద్వారా బీపీ చెక్ చేసుకోవచ్చని ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది కదా.. ఆ యాప్ కు రేటింగ్, రివ్యూలను అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ వర్శిటీ పరిశోధకులు విశ్లేషించారు. రేటింగ్ ఇచ్చిన వారిలో 60 శాతం  మంది అద్భుతమైన యాప్ అని పేర్కొన్నారు. అయితే తర్వాతి కాలంలో ఆ యాప్ నాణ్యమైన ఫలితాలు ఇవ్వలేకపోయింది. అంటే రేటింగ్ వచ్చినంత మాత్రానా అది కచ్చితంగా నాణ్యమైందనే విషయం తెలిసింది కదూ...


యాప్ ఎంచుకనే సమయంలో ముఖ్యంగా వైద్య రంగం యాప్‌లపై మరింత అప్రమత్తత అవసరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  వైద్యపరమైన అవసరాల కోసం రేటింగ్స్, రివ్యూలపై మాత్రమే ఆధారపడి యాప్‌లను ఎంచుకోవద్దని పరిశోధకులు  సూచిస్తున్నారు. వైద్య సేవుల విషయంలో సాధ్యమైనంత వరకు సాధారణ పద్దతుల్లో వెళ్తేనే బెటర్ అని సలహా ఇస్తున్నారు.