రీసెంట్ గా ప్రారంభమైన  'యాత్ర' ఘూటింగ్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.  ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మోడ్ లో ఉన్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈనెల 8న యాత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి టీజర్ సిద్ధమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు యాత్ర మూవీకి సంబంధించి  మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు. ఇప్పటికే యాత్ర టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఈసారి కేవలం వైఎస్ శరీర అర్థ భాగం మాత్రమే కనిపించేలా మరో స్టిల్ రిలీజ్ చేశారు.



తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ పాదయాత్రకు చాలా ప్రభావం ఉంది. ఆ పాదయాత్ర ద్వారానే వైఎస్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే యాత్ర సినిమాలో ఈ పాదయాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ రోజు రిలీజ్ అయిన పిక్ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తోంది.