వైఎస్ జగన్ విడుదల చేసిన ఇదం జగత్ టీజర్ ఇదే
ఇదం జగత్ టీజర్
వైవిద్యభరితమైన చిత్రాల ఎంపికలో ఎప్పుడూ ముందుండే సుమంత్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా ఇదం జగత్. అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సుమంత్ సరసన కేరళ కుట్టి అంజు కురియన్ జంటగా నటించింది. ఇదం జగత్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయించారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. విరాట్ ఫిలింస్, శ్రీ విఘ్నే్ష్ కార్తిక్ సినిమాస్ బ్యానర్స్‌పై పద్మావతి జొన్నలగడ్డ, శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్, భిన్నమైన కథనం కూడా సొంతమైనట్టు యూనిట్ చెబుతోంది.