కరోనా కష్ట సమయంలో అందరూ ఆరోగ్యం (Lifestyle Tips)పై దృష్టిసారిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసు పని చేయడం, లేక వ్యాపారం, ఇతరత్రా పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటాం. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ఒత్తిడిని జయించి.. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం ఈ పది (Health Tips) విషయాలు పాటిస్తే సరి.. COVID19 Medicine: రూ.59కే కరోనా ట్యాబ్లెట్..


  • చాలా రకాల ఆహార పదార్థాలు తినాలి. ఒక్కో ఐటెమ్‌లో ఒక్కో రకం పోషకాలు మన శరీరానికి అందుతాయి.

  • పోషక విలువలు అధికండే ఆహారాన్ని, స్నాక్స్ తీసుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు మిగతా రోజుల కంటే ఎక్కువగా తినేస్తాం. అలాంటి రోజులలో శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం సమతూల్యత సాధిస్తుంది.

  • కొవ్వు పదార్ధాలను ఏ మోతాదులో తింటున్నారో చెక్ చేసుకోండి. శరీరానికి ఆరోగ్యానిచ్చే కొవ్వు పదారార్థాలను తగినంత తీసుకోవాలి. చెడు కొవ్వు ఉండే వాటిని అతి తక్కువగా తినాలి.

  • కూరగాయాలు, పండ్లు సాధ్యమైనంతగా తీసుకోవాలి. వీటిని తినడం ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్ శరీరానికి సమకూరుతుంది. సమ్మర్ అయితే వాటర్ మిలన్ లాంటివి స్నాక్స్ సమయంలో తింటే బెటర్. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?

  • మీరు వంటలలో ఉప్పు అధికంగా వేస్తున్నారా, చక్కర అధికంగా తింటున్నారా.. అయితే మీరు అనారోగ్యానికి చేరువ అవుతున్నట్లే. ఉప్పు, తీపి పదార్థాలను తగిన మోతాదులో తీసుకుంటే బీపీ (Blood Pressure), మధుమేహం బారిన పడకుండా ఉంటాం. 

  • వేళకు అల్పాహారం, భోజనం చేయాలి. మంచి పోషక విలువలున్న ఆహారం తినడం ఎంత ముఖ్యమే సమయానికి తినడం అంతే ముఖ్యమని వైద్యులు చెబుతారు. 

  • రోజుకు కనీసం రెండున్నర నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. వేసవిలో అయితే డీహైడ్రేషన్ కాకుండా ఇంకాస్త ఎక్కువ తాగాల్సి ఉంటుంది. వీటితో పాటు వీలైతే పళ్ల రసాలు, పాలు, క్యారెట్ జ్యూస్ లాంటివి తాగితే శరీరం ఉత్తేజంగా ఉంటుంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

  • ఎత్తుకు తగ్గ శరీర బరువుతో ఉండాలి. బరువు కాస్త ఎక్కువగా ఉంటే పర్లేదు కానీ.. చాలా వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. 

  • యంత్రాలపై ఆధారపడటం కాస్త తగ్గించాలి. రోజుకు గంటసేపైనా వాకింగ్, ఏదైనా వ్యాయామం చేయాలి. మెట్లు ఎక్కేందుకు లిఫ్ట్, ఎలివేటర్స్ వాడకుండా నడవటం ద్వారా కొవ్వు కరుగుతుంది. 

  • చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ మానేయడం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఉదయం లేచినప్పుడు టిఫిన్ తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. లేకపోతే దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్!