How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే

How to check BP: రక్తపోటు లేదా అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ( Over weight ) ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ( Blood pressure) ఎక్కువగా కనిపిస్తోంది.

Updated: Aug 7, 2020, 06:15 PM IST
How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే

How to check BP: రక్తపోటు లేదా అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ( Over weight ) ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ( Blood pressure) ఎక్కువగా కనిపిస్తోంది. రక్తపోటును అధిగమించాలంటే ఆహార నియమాలపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. రోజువారి ఆహారంలో  పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్దాలను తీసుకోవాలి. తక్కువ మోతాదులో సోడియం ఉన్న ఆహారపదార్దాలను తీసుకోవడం వలన రక్తపోటును హెచ్చుతగ్గులు కాకుండా నియంత్రించవచ్చు. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం

Foods to control blood pressure రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడే 10 రకాల ఫుడ్స్ మీకోసం:

Banana health benefits అరటిపండు :
అధిక రక్తపోటుకు గల కారణాలలో సోడియం ఒకటి. అరటిలో లభించే అధిక పొటాషియం కంటెంట్ సోడియం చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, పొటాషియం అధికంగా ఉండే ఇతర ఆహారాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేసి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుంది.

Blue berry బ్లూబెర్రీ :
బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు ( Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటును నివారించడంలో ఆంథోసైనిన్స్ అని పిలువబడే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి. బ్లూబెర్రీస్ ఉదయం పరిగడుపున తీసుకోవడం మంచిది. వీటిని ఎవరి అభిరుచులకు తగినట్టుగ వారు డైరెక్టుగానైనా తీసుకోవచు లేదా మిల్క్‌షేక్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. Also read: 
Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ?

Leafy vegetables ఆకు కూరలు:
పాలకూర, క్యాబేజీ, లెట్యూస్, కొల్లార్డ్ గ్రీన్స్ ( Spinach, cabbage, lettuce, Collard green ) వంటి ఆకుకూరలలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును కంట్రోల్‌లో ఉండేలా దోహదం చేస్తుంది. ఆకుకూరలను సలాడ్లు, శాండ్‌విచ్‌లు లేదా డిష్ రూపంలో సులభంగా ఆరగించవచ్చు. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి.

Garlic health benefits వెల్లుల్లి:
మన వంటగదిలో ఉండే వెల్లుల్లి ఒక సహజ యాంటీబయాటిక్.. యాంటీ ఫంగల్ ఫుడ్. వెల్లుల్లి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. ఈ మార్పులు రక్తపోటును తగ్గిస్తాయి. Also read: 
Coronavirus through mosquitoes: దోమ కాటుతో కరోనావైరస్ వ్యాపిస్తుందా ?

Tomato టమాటా :
టమాటాలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే కెరోటినాయిడ్లను కూడా కలిగి ఉంది. టమోటాలు సలాడ్‌లో భాగంగా, సూప్‌గా లేదా రసంగా తీసుకోవడం ద్వారా ఆహారాన్ని మరింత ఆనందించవచ్చు.

Dark chocolate డార్క్ చాక్లెట్ :
చాక్లెట్లు తినడం వలన లావుగా అవుతారు అని చాక్లెట్లను తినడం వదులుకుంటారు. కాని డార్క్ చాక్లెట్లను తినడం వలన రక్త పోటు అధిగమించవచ్చు. డార్క్ చాక్లెట్‌లోని కోకో రక్త నాళాల్లోని రక్తాన్ని చిక్కబడనివ్వకుండా ఉంచుతుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. అలా అని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఎక్కువగా తినకుండా చూసుకోవాలి. Also read: 
Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు

Olive oil ఆలివ్ నూనె:
ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో ఇవి ఎంతో సహాయ పడతాయి. ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలను ( Olive oil benefits ) పొందటానికి సలాడ్లు, పాస్తాలపై స్ప్రే చేసుకోవచ్చు. ఈ  నూనెని వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల దాని గుణాలను కోల్పోయేలా చేస్తుంది.

Fish చేపలు :
మాకేరెల్, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 ఫ్యాట్టి ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. రక్త నాళాల్లో మంటను తగ్గించడంతో పాటు ట్రైగ్లిజరైడ్స్‌ను కూడా తగ్గిస్తాయి. అధిక రక్తపోటును నివారించడానికి చేప మాంసం ఉపయోగపడుతుంది. Also read: 
Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు

Pista benefits పిస్తా పప్పు : 
ఇందులో అధిక ప్రోటీన్, అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. ఇవి మిమ్మల్ని పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి.

Flaxseeds అవిసె గింజలు :
రక్తపోటును తగ్గించడంలో అవిసె గింజలు శక్తివంతమైన సూపర్ ఫుడ్ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో అవసరమైన ఒమేగా -3 ఫ్యాట్టి ఆమ్లాలు, α- లినోలెనిక్ ఆమ్లాలు ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి. Also read: 
COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

అధిక రక్తపోటు స్పష్టమైన లక్షణాలను చూపించదు. చాలా ఆలస్యం అయ్యే వరకు గుర్తించడం కష్టం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవచ్చు. తద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఈ ఆహారాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా మేలు చేస్తాయి. ముందు జాగ్రత్తతో, రక్తపోటును సులభంగా నివారించవచ్చు. Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్