Facts About Castor Oil: ఇవి తెలిస్తే తప్పకుండా ఆముదం నూనెను మీరు కూడా వినియోగిస్తారు!
Interesting Facts About Castor Oil: ఆముదం నూనెను కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు నొప్పి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి, మర్దన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Interesting Facts About Castor Oil: ఆముదం నుంచి తీసిన నూనెలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి అందుకే ఆయుర్వేద శాస్త్రంలో ఆముదం నూనె గురించి క్లుప్తంగా వివరించారు. ఆయుర్వేద పరిభాష ప్రకారం ఆముదాన్ని కార్మినేటివ్ అంటారు. దీని నుంచి తీసిన నూనెను వాపు అన్ని రకాల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆముదం నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా ఆముదం నూనె వినియోగించడం వల్ల శరీర దానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనివల్ల శరీరాన్ని కలిగి లాభాలేంటో? ఈ నూనెను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆముదం చూడడానికి ఎంతో జిగుటుగా ఉన్నప్పటికీ ఇది అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేదని పనులు చెబుతున్నారు ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆముదం ప్రభావవంతంగా సహాయపడుతుంది అయితే పుట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆముదాన్ని వినియోగించే క్రమంలో వైద్యుల సలహాలు తీసుకొని వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా ఆముదం పిల్లలకు కడుపులో ఉండే నులిపురుగులను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పిల్లల పొట్ట సమస్యలకు కూడా ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది. అయితే దీనికోసం పిల్లలకు పట్టించే పాలలో తక్కువ పరిమాణంలో ఆముదాన్ని కలిపి, ప్రతి రోజు వారికి ఇవ్వడం వల్ల నులిపురుగు సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా అన్ని రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఆయుర్వేదంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆముదం నూనెను నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపులు ఇతర నరాల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల సమస్యల నుంచి కూడా ఆముదం నూనె ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా ఇలాంటి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా నొప్పి ప్రభావిత ప్రాంతంలో ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter