Healthy Lungs: ఊపిరితిత్తులకు హాయినిచ్చే 5 ఆహారాలు .. ఆస్తమా రోగులకు వరం, బ్రాంకైటీస్‌కు దివ్యౌషధం..
5 Foods For Healthy Lungs: ఈ సీజన్లో రొంప సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి ఊపిరితిత్తుల డిటాక్సిఫికేషన్ తప్పనిసరి. హానికర కాలుష్యం పదార్థాలు వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. దీంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువవుతాయి. అయితే లంగ్స్ ఆరోగ్యవంతం చేయడానికి కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి వీటి వల్ల ఈజీగా ఊపిరితిత్తుల సమస్య బయటపడవచ్చు.
5 Foods For Healthy Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే గాలి సజావుగా పీల్చుకుంటాం. ఈ ఊపిరితిత్తులు మంచి గాలిని మన శరీరంలోకి పంపిస్తుంది. ఇది గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీర ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతుంది. మంచి గాలితో ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులకు ఆరోగ్యం ఇచ్చే ఆహారాలు ముఖ్యంగా మన డైట్లో చేర్చుఉకోవాలి. అలాంటి ఆహారాలు ఏం ఉంటాయో తెలుసుకుందాం.
వెల్లుల్లి..
వెల్లుల్లి మన వంట గదిలో నిత్యం అందుబాటులో ఉండే వస్తువే. దీంట్లో అల్లిసిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ప్రధానంగా ఇందులో ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. పవర్ ఫుల్ టాక్సిఫై ఫుడ్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు కూడా ఉంటాయి. దీనితో మీ ఊపిరితిత్తులు హాయిగా ఉంటాయి.
పసుపు..
పసుపులో కూడా డిటాక్సీఫై చేసే గుణాలు ఉంటాయి. ఉపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తాయి. పసుపు కూడా మన వంట గదిలో అందుబాటులో ఉంటుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఊపిరితిత్తులను కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల మంట, వాపు సమస్య నుంచి తగ్గిస్తుంది.
అల్లం..
అల్లం కూడా ఊపిరితిత్తులు డిటాక్సిఫై చేయడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తులను సంరక్షించడం ఎంతో ముఖ్యమైన పాత్ర. అల్లంతో టీ తాగడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అల్లం ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేస్తుంది. మన ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జింజోరైల్ ఊపిరితిత్తులను కాపాడుతాయి అంతేకాదు అల్లం డైట్ లో చేర్చుకోవడం వల్ల రొంప సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.
ఇదీ చదవండి: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..
యాపిల్స్..
ఎప్పటి నుంచో వైద్యులు చెబుతుంటారు. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు అని .. ఎందుకంటే యాపిల్ లో అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. యాపిల్ ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుతుంది ఆస్తమా, బ్రాంకైటీస్ సమస్యతో బాధపడుతున్న వారు యాపిల్ లు కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి. ఇది ఆక్సిడేటివ్స్ ప్రెస్ నుంచి కాపాడుతుంది, యాపిల్ లో ఫ్లేవర్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఊపిరితిత్తులను రక్షిస్తుంది.
ఇదీ చదవండి: ఈ 10 ఆహారాలతో నిత్య యవ్వనం.. ముఖంపై ఒక్క మచ్చ, గీత కూడా కనిపించడం కష్టం..
బెర్రీ పండ్లు..
బెర్రీ పండ్లు ఎంతో ఆరోగ్యకరమని మనకు తెలుసు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి కాపాడతాయి. కీలక పాత్ర విటమిన్ సి పుష్కలంగా ఉండే బెర్రీ పండ్లు ఇమ్యూనిటీని పెంచతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కు పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెరిస్, రాజ్బెరిస్ వంటి వాటిలో ఆయూవు పోసే గుణం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.