COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 Incredible Wood Apple Benefits: వెలగపండు పేరు చెప్పగానే కాయ ఆకారం, రంగు అందరికీ తెలిసిపోతుంది. ఈ పండును వినాయక పూజలో భాగంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వెలగ పండులో శరీరానికి కావలసిన అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తినడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


అనారోగ్యకరమైన ఆహారాలు తినడం కారణంగా వచ్చే అల్సర్ సమస్య నుంచి కూడా వెలగపండు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పండును నేరుగా తినడంతో పాటు జ్యూస్ లా తయారు చేసుకొని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ జ్యూస్ లో బెల్లాన్ని మిక్స్ చేసుకొని తాగితే శరీర బలహీనత, నీరసం, అలసట వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు మూత్రపిండాల సమస్యలు కూడా దూరమవుతాయి.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ముఖ్యంగా వెలగపండు జ్యూస్ ను స్త్రీలు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గర్భాశయ క్యాన్సర్లతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వెలగపండు జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియాను బాడీ నుంచి బయటికి పంపిస్తుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి