7 Health Tests: వృద్ధాప్యంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వయస్సు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమౌతుంటుంది. అందుకే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల ప్రారంభదశలో వ్యాధుల్ని గుర్తించడమే కాకుండా తగిన చికిత్సకు వీలవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక బిజీ ప్రపంచంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె వ్యాధులు, డయాబెటిస్ రక్తపోటు, కొలెస్ట్రాల్, కిడ్నీ వ్యాధులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు సరక్వ సాధారణంగా మారిపోయాయి. ఈ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో ముఖ్యమైంది బ్లడ్ ప్రెషర్ టెస్ట్.  నిర్ణీత వయస్సు వచ్చిన తరువాత అధిక రక్తపోటు లేదా లో బీపీ వంటి సమస్యలు రావచ్చు. వీటివల్ల గుండె వ్యాధులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు ఎదురౌతాయి. అందుకే క్రమం తప్పకుండా బీపీ టెస్ట్ చేస్తుండాలి. దీనికోసం బీపీ మెషిన్ ఇంట్లోనే ఉంచుకుంటే మంచిది. ఇక రెండవది థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ సమస్య ఉంటే అలసట, బరువు పెరగడం మూడ్ స్వింగ్ వంటి పరిస్థితి ఎదురుకావచ్చు. నిర్ణీత వయస్సు వచ్చిన తరువాత థైరాయిడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి.


చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ ఉంటే రక్తపోటు, మధుమేహం, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్ చెక్ చేయవచ్చు. అది చాలా అవసరం. నిర్ణీత వయస్సు దాటిన తరువాత అప్పుడప్పుడూ ఈ పరీక్ష చేయిస్తుండాలి. ఇక ఇటీవలి కాలంలో సాధారణంగా మారిన డయాబెటిస్. దీనిని ప్రారంభదశలో గుర్తించగలిగితే సులభంగా నియంత్రించవచ్చు. లేకపోతే పరిస్థితి గంభీరమై ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. అందుకే వయస్సు పెరిగినప్పుడు తప్పకుండా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. 


వయస్సుతో పాటు చూపు, వినికిడి తగ్గుతుంటుంది. కేటరాక్ట్ వంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. అందుకే కొన్ని కంటి పరీక్షలు అప్పడప్పుడూ చేయిస్తుంటే గ్లూకోమా, కేటరాక్ట్ వంటి సమస్యల్ని గుర్తించి చికిత్స చేయించవచ్చు. ఇక నిర్ణీత వయస్సు దాటిన తరువాత తప్పకుండా చేయించాల్సిన మరో పరీక్ష బోన్ డెన్సిటీ టెస్ట్. ఈ పరీక్ష ద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సీరియస్ వ్యాధి ముప్పు ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు. ఏడాదికోసారి లేదా రెండేళ్లకోసారి తప్పకుండా ఈ పరీక్ష చేయించాలి.


ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కేన్సర్ మహమ్మారి ఇంకా అంతుబట్టడం లేదు. కేన్సర్ మరణాల సంఖ్య పెరుగుతోంది. కేన్సర్ ఎలాంటిదైనా సకాలంలో గుర్తించగలిగితే చికిత్స సాధ్యమే. కానీ నిర్ధారణ ఆలస్యమైతే చికిత్స కష్టమౌతుంది. అందుకే కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా అవసరం. బ్రెస్ట్ కేన్సర్ అయితే మ్యామోగ్రామ్ టెస్ట్, కోలోరెక్టల్ కేన్సర్ అయితే కొలోనోస్కోపీ, ప్రోస్టేట్ కేన్సర్ అయితే పీఎస్ఏ టెస్ట్ చేయించాలి. 


Also read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.