Acidity Home Remedies: ప్రస్తుతం చాలా మందిలో ఛాతీ, గొంతులో మంటలు రావడానికి ప్రధాన కారణాలు ఎసిడిటీనేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎసిడిటీ సమస్య కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.  అయితే ఈ వల్ల చాలా మందిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎసిడిటీ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారాలపై పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో పలు రకాల మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిట్కాలతో అసిడిటీ సమస్యలకు చెక్‌:
ఆహారపు అలవాట్లలో మార్పు:

అసిడిటీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా తిన్న తర్వాత వెంటనే కూర్చొకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం మానుకోండి:
అసిడిటీ సమస్యలతో బాధపడేవారు కార్బోనేటేడ్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారు. అయితే వీటిని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రింక్స్‌ అతిగా తాగడం వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావొచ్చు.


స్లీపింగ్ విధానం:
నిద్రపోతున్నప్పుడు తల పైభాగాన్ని ఎత్తుగా, మీ పాదాలను కొద్దిగా క్రిందికి ఉంచాల్సి ఉంటుంది. ఈ చిట్కాను పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.


బరువును అదుపులో ఉంచుకోండి:
తరచుగా ఎసిడిటీ సమస్యతో సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.  అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి