Amla: ఉసిరికాయ పొడితో తెల్ల జుట్టుకు గుడ్ బై చెప్పండి ఇలా!
Amla Hair Benefits: ఆధునిక జీవనశైలిన మారిన ఆహార అలవాట్లు కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడానికి వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు.
Amla Hair Benefits: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలడం, తెల్ల జుట్టు బారిన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య తలెత్తడానికి కారణం పోషక ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి ఇతర సమస్యలు వల్ల దీని బారిన పడుతున్నారు.
అయితే కొంతమంది ఈ సమస్య బారిన నుంచి బయటపడానికి హెయిర్ ప్రొడెట్స్, మందులు వాడుతున్నారు. అయితే మీరు ఎలాంటి మందులు ఉపయోగించకుండా ఇంట్లోనే ఎప్పుడు తరుచుగా ఉపయోగించే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిని ఉపయోగించడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఉసిరిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పరిష్కారమవుతాయి.
ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు , విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఉసిరికాయను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు సహజ రంగును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిని ఉపయోగించడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఉసిరితో తయారు చేసుకొనే కొన్ని చిట్కాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ హెయిర్ ప్యాక్ :
ముందుగా ఏడు ఉసిరికాయలు తీసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళ కూడా తీసుకోవాలి. ఉసిరిని ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలలో కొంచెం నీరు కలుపుకోవాలి. దీని పేస్ట్‌లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు రాయండి. ఇరువై నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also Read Weight Loss - Garlic: అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా.. వెల్లుల్లితో సింపుల్‌గా ఈ టిప్స్ పాటించండి..
ఉసిరికాయ పొడి:
ముందుగా ఒక గిన్నెలో ఉసిరి పొడి, తేనెను ఉపయోగించి కలుపుకోవాలి. కొద్దిగా నీరు పోసి దీని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని తలపై అప్లై చేసుకోవాలి. ఒక గంట తరువాత జుట్టును తేలికపాటి క్లెన్సర్, నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చుండ్రు , తెల్ల జుట్టు, జుట్టు రాలడం, పొడి వంటి వివిధ జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌గా పనిచేసే తేనెతో ఆమ్లా పొడి ఎంతో ఉపయోగపడుతుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter