Former CM KCR: మరో జడ్జిని నియమించండి.. కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on KCR Petition: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది.  చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ విచారణ చేపట్టారు. కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
 

1 /8

విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని ముకుల్ రోహత్గి వాదించారు. ట్రిబ్యునల్స్ ఉండగా.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు.  

2 /8

కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా.. తాము యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశామని వాదించారు.  

3 /8

విచారణకు ముందే దోషి అని తేలుస్తున్నారని.. ఇది కక్ష సాధింపు చర్య అని అన్నారు. ఈఆర్‌సీ ఉండగా.. మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదని స్పష్టం చేశారు.   

4 /8

అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని.. తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామన్నారు.  

5 /8

కేసీఆర్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కీలక వాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుబట్టారు సీజేఐ డివై చంద్రచూడ్. కమిషన్ చైర్మన్  ప్రెస్ మీట్ ఎలా పెడతారు..? కమిషన్ చైర్మన్ ఎలా తన  అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు..? అని అన్నారు. మరో జడ్జిని నియమించాలని.. న్యాయమూర్తి  న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనపడాలన్నారు.   

6 /8

గత ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

7 /8

అయితే ఈ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదని.. న్యాయ సుత్రాలకు విరుద్దంగా కమిషన్ ఏర్పాటు చేశారని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   

8 /8

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగాల్సి ఉండడగా.. ధర్మాసనం ఇవాళ్టికి వాయిదా వేసి విచారణ చేపట్టింది. కాగా.. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించగా తోసిపుచ్చింది.